Skip to main content

Scholarship for Tenth Students: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నం..!

ప‌దిలో ఉత్త‌మ మార్కుల‌ను పొందిన విద్యార్థుల‌కు ఈ ఉప‌కార వేత‌నం అందజేస్తుంది కేంద్ర ప్ర‌భుత్వం..
Economic support for education  Scholarship beneficiaries  Education opportunity for economically backward students  Central Government provides Sarojini Damodar Foundation Vidyadan Scholarship to students

కొల్లిపర: పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సరోజిని దామోదర్‌ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ ఉపకార వేతనం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు ఒడిశా, కేరళ, తెలంగాణ, తమిళినాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాలో అమలవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సుమారు 7 వేల మందికిపైగా ఆర్థిక సహాయం, 28 వేల మంది వరకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

Longest Serving Lok Sabha Members: లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచింది వీరే..!

ఎంపికైన విద్యార్థులు రెండేళ్ల పాటు ఫౌండేషన్‌ నుంచి స్కాలర్‌షిప్‌ పొందవచ్చు. విద్యార్థులు ప్రతిభ ఆధారంగా నచ్చిన రంగంలో డిగ్రీ చదవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకూ ఉపకార వేతనం అందజేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌ ద్వారా భవిష్యత్‌కు అవసరమైన దిశానిర్దేశం చేస్తారు.

అర్హతలివీ..

ఉపకార వేతనం పొందాలంటే ఆ విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీయెట్‌ చదువుతున్న వారు అర్హులు, పదిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు రావాలి.

CLAT Notification: క్లాట్‌తో వివిధ‌ నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు.. ప‌రీక్ష తేదీ!

ఎంపిక విధానం..

చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్‌ 23న దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఈ మెయిల్‌ ద్వారా సమాచారం తెలియజేశారు. ఎంపికై న విద్యార్ధులు జూన్‌ 20 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జూన్‌ 7వ తేదీ వరకూ గడువు

విద్యాదాన్‌ ఉపకార వేతనం కోసం జూన్‌ 7వ తేదీ లోగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్తులు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, చదువుతున్న కళాశాల వివరాలను పొందుపర్చాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ మెయిల్‌ కలిగి ఉండాలి.

Assistant Professor Posts: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. అర్హులు వీరే!

నెట్‌ సెంటర్‌, ఇతరుల ఈ–మెయిల్‌ ఐడీలను అనుమతించరు. భవిష్యత్తులో ఎస్‌డీఎఫ్‌ నుంచి ఎటువంటి సమాచారమైనా ఈ మెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. అందుకే సొంత ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్‌లైన్‌లో విద్యాదాన్‌ ఆంధ్రఃఎస్‌డీ ఫౌండేషన్‌ఇండియా.కామ్‌, (vidyadhan@sdfoundationindia.com)కి మెయిల్‌ చేయాలి. లేదా తమ సొంత నంబరు ద్వారా 9663517131 నంబర్‌లో సంప్రదించాలి.

దరఖాస్తు చేసుకునే విధానం

●విద్యార్ధులు ప్లేస్టోర్‌లోని విద్యాదాన్‌ యాప్‌, లేదా విద్యాదాన్‌ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విద్యాదాన్‌.ఓఆర్‌జీలో(https://www.vidyadhan.org/web/index.php) ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

●పదో తరగతి మార్కుల జాబితాల ప్రకారం పేరులో మొదటి పేరును ఎంటర్‌ చేయాలి. తర్వాత రెండో పేరును నమోదు చేయాలి. అనంతరం విద్యార్థి సొంత చిరునామను నమోదు చేయాలి.

●అప్లయ్‌ నౌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీ ఈ మెయిల్‌కు మీ అకౌంట్‌ యాక్టివేషన్‌ కోసం లింక్‌ వస్తుంది. యాక్టివేషన్‌ లింక్‌ క్లిక్‌ చేయగానే విద్యాదాన్‌ హోమ్‌ పేజీలో అకౌంట్‌ యాక్టికేటెడ్‌ అనే మెసేజ్‌ కనిపిస్తుంది.

Boeing Aero Space: బోయింగ్‌ ఏరోస్పేస్‌ ట్రైనింగ్‌కు ఎంపికైన పాలిటెక్నిక్‌ విద్యార్థులు

●ఈ మెయిల్‌ ఐడీ , విద్యాదాన్‌ పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అయితే స్టెప్‌–2లోకి వెళతారు. లాగిన్‌ అయిన తర్వాత హెల్ప్‌పై క్లిక్‌ చేసి, సూచనలు చదివి, దాని ప్రకారం అప్లికేషన్‌ పూర్తి చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్‌ చేయాలి. అప్లికేషన్‌ పూర్తి చేసిన తర్వాత ఎడిట్‌పై క్లిక్‌ చేస్తే అప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు.

●ఎంటర్‌ చేసిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. సబ్మిషన్‌ సక్సెస్‌ఫుల్‌ అని చూపిస్తుంది. డాక్యుమెంట్లు , పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోను ఆప్‌లోడ్‌ చేసిన తర్వాతే దరఖాస్తును అంగీకరిస్తారు.

●విద్యార్థులు ఎప్పటికప్పుడు ఈ మెయిల్‌ను చెక్‌ చేసుకోవాలి.

ఎస్‌డీఎఫ్‌ ప్రతి సమాచారాన్ని ఈ మెయిల్‌ ద్వారా మాత్రమే తెలియజేస్తుంది. కావున వారంలో ఒక సారైన మెయిల్‌ చెక్‌ చేసుకోవాలి.

విద్యార్థులకు విద్యాదాన్‌ స్కాలర్‌షిప్స్‌ పదో తరగతిలో 90 శాతం మార్కులు ఉండాలి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో నమోదు చేసుకోవాలి జూన్‌ 7 వరకు దరఖాస్తుకు గడువు

 TCIL Recruitment: టీసీఐఎల్‌లో జనరల్‌ మేనేజర్‌ పోస్టులు..

Published date : 23 May 2024 11:05AM

Photo Stories