Campus Recruitment Drive: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు సెలక్ట్ అయిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
Sakshi Education
నూజివీడు: ట్రిపుల్‌ఐటీలోని ఎంఎంఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఐదుగురు క్యాంపస్‌లో నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నీలపు శ్రీవాణి, ఎన్.క్రాంతికుమారి, కే హేమలత, కే మమతాంజలి, వై మంజుల చైన్నెకు చెందిన కేసీపీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమెటెడ్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు రూ.3 లక్షల వార్షిక వేతనానికి ఎంపిక కాగా డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు పరిమితం కాకుండా కోర్ గ్రూపుకు సంబంధించిన మెరుగైన ఉద్యోగ అవకాశాలున్నాయని వాటివైపు దృష్టి సారించాలన్నారు. గత కొన్నేళ్లుగా మెటలర్జీ విభాగం విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారన్నారు.
Webinar: కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే వారికోసం.. 'సాక్షి ఎడ్యుకేషన్' ప్రత్యేకంగా..
దేశంలో మెటలర్జీ రంగంలో ఉద్యోగాల కొరత ఉందని, ఎన్నో ఉద్యోగ అవకాశాలున్నాయని విభాగాధిపతి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ వీర శ్రీను, శివకుమార్, జ్యోతీలాల్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 17 Dec 2024 05:39PM