Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free training in photography
నెల రోజుల పాటు ఇచ్చే శిక్షణకు 18–45 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువకులకు ప్రాధాన్యత ఇస్తారని, దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు : 94409 05478, 99856 06866లలో సంప్రదించాలని వివరించారు.