Free Training On Computer Skills: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. 100% జాబ్ గ్యారెంటీ
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగుళూరులో కంప్యూటర్, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్షణతో పాటు నూరు శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి హరిప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free Training On Computer Skills
టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులకు బెంగుళూరులో 35 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.
ట్యాలీ ప్లస్ జీఎస్టీ, స్పోకెన్ ఇంగ్లిషు, కంప్యూటర్, కమ్యూనికేషన్, లైఫ్, ఇంటర్వ్యూ స్కిల్స్‌తో పాటు వర్క్‌ప్లేస్ ఎథిక్స్‌పై అత్యుత్తమ శిక్షణ కల్పిస్తామని వివరించారు. శిక్షణానంతరం వివిధ సంస్థల్లో నెలకు రూ.15వేలకు పైబడిన వేతనంతో నూరు శాతం ఉద్యోగాలను చూపిస్తామని తెలిపారు.