TTC Summer Training Courses: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
పార్వతీపురం టౌన్: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో మే 1నుంచి జూన్ 11 వరకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
TTC Summer Training Courses
ఏప్రిల్ 3 నుంచి 25వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 1 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 45ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో మే 1వ తేదీన హాజరు కావాలని సూచించారు.
ముఖ్య సమాచారం: వేసవి ట్రైనింగ్ కోర్సులకు ఆహ్వానం
ట్రైనింగ్ ప్రారంభం: మే 1 నుంచి ఎప్పటివరకు: జూన్ 11 వరకు
వయస్సు: 18-45 ఏళ్లలోపు అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది