Skip to main content

Fake Certificates : న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా.. ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టారిలా..?

న‌కిలీ స‌ర్టిఫికెట్లతో చాలామంది ఉద్యోగాలు పొంది నిరుద్యోగుల‌కు అవ‌కాశం లేకుండా చేస్తున్నార‌ని కొంద‌రు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
Fake certificates causing injustice for unemployed youth

సాక్షి ఎడ్యుకేష‌న్: న‌కిలీ స‌ర్టిఫికెట్లతో చాలామంది ఉద్యోగాలు పొంది నిరుద్యోగుల‌కు అవ‌కాశం లేకుండా చేస్తున్నార‌ని కొంద‌రు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉన్న‌ ఖాళీలను భర్తీ చేస్తు వ‌చ్చింది.

Exams Question Papers Leak Cases 2024 : ఈ ఏడాది పేపర్ లీక్ అయిన ప‌రీక్ష‌లు ఇవే.. ఎక్కువ‌గా ఈ ప‌రీక్ష‌లే...!

ఈ నియామ‌కాల్లోనే కొంద‌రు ఉద్యోగులు వారి స‌ర్టిఫికెట్ల‌ను ఫేక్ చేసి ఆయా సంస్థ‌ల్లో పొందుప‌రుస్తున్నార‌ని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఫేక్ స‌ర్టిఫికెట్ల వివాదంపై జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా, వాళ్ల‌లో ఎవ‌రినీ ఆశ్ర‌యించినా ఎవ్వ‌రూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు నిరుద్యోగులు. 

బీఆర్ఎస్ హయాంలో మూతపడిన స్కూళ్ల కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 200 వ‌ర‌కు ఉద్యోగులు ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో నియామ‌కం అయ్యారని పేర్కొన్నారు. ఈ ఉద్యోగుల్లో కానిస్టేబుళ్లతో పాటు ఎస్ఐ, ఏఈఈ, డీఎస్సీ పోస్టుల్లో చేరారని చెప్పుకొస్తున్నారు.

Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

డీఎస్సీ నియామకాల‌తో..

వివిధ ఉద్యోగాల్లో న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌ల‌తో నిరుద్యోగుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని వాపోతున్నారు. అయితే, తాజాగా నియమించి డీఎస్సీ 2024 పోస్టుల్లో కూడా చాలామంది ఇలాగే న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో ఉద్యోగాల్లో చేరారంటున్నారు. అచ్చంపేటలో తాజాగా ఇలాంటి ఒక‌ ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ కూడా  కొనసాగుతొంది. అయితే, అలాంటి ఘటనలే హైదరాబాద్ జిల్లాలోనూ జరిగినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే..

ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలోనే పలువురు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. 2018 నుంచి 2023 మధ్యలో ఈ దందా జరిగినట్లుగా అనుమాన ప‌డుతున్నారు.

500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడంలేదని పలువురు అభ్యర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. తాజాగా హిమాయత్ నగర్ కు చెందిన విద్యాశాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వివిధ రంగాల్లో.. ఈ స్కూళ్ల ఆధారంగా..

స్థానికులు కాకపోయినప్పటికీ నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి.. ఇక్కడ నియామకమైనట్లు పేర్కొంటున్నారు. ఇలా చేరిన వారిలో కానిస్టేబుల్ నుంచి మొదలుకుని ఎస్ఐ, ఏఈఈ, టీచర్లుగా పోస్టుల్లో నియామకమైనట్లు చెబుతున్నారు. 
హైదరాబాద్ జిల్లా పరిధిలో మూతపడిన స్కూళ్లలో చదివినట్లుగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదనే ధీమాతో వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ అంటేనే హాట్ కేక్. అంతేకాకుండా, నగరంలో ఉండటంతో పాటు హెచ్ఆర్ఏ అలవెన్సులు అధికంగా పొందవచ్చనే ఉద్దేశం కూడా కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ వినిపిస్తుంది.

Job Mela : రేపే జాబ్ మేళా.. వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి విద్యార్హ‌త‌లివే.. ఎక్క‌డంటే!

ఎస్జీటీ ఉద్యోగి..

అందించి డీఎస్సీ నియామ‌కాల్లో ఎస్జీటీగా ఉద్యోగం పొందిన ఒక యువతి తన స్థానికతను కాదని హైదరాబాద్ లో ఉద్యోగం పొందిందని నిరుద్యోగులు పలువురు ఫిర్యాదు చేశారు. సదరు యువతి వాస్తవానికి 1 నుంచి 7వ తరగతి వరకు అమ్రాబాద్ లో చదువుకుందని చెబుతున్నారు. ఆపై 8 నుంచి 10వ తరగతి వరకు కాచిగూడలో చదువుకుందని చెబుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

దీనికోసం పలు రికార్డులను ట్యాంపరింగ్ చేశారని వారు వాపోతున్నారు. ఆమె సర్టిఫికెట్ల ఆధారంగా ఆమెకు నాగర్ కర్నూల్ జిల్లా స్థానికత అవుతుందని చెబుతున్నారు. కానీ సదరు యువతి ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్లతో సికింద్రాబాద్ లోని ఒక పాఠశాలలో ఉద్యోగం పొందిందని వాపోతున్నారు.

న్యాయం కావాలి

విచారణ చేపట్టి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించాలి. ఇలాంటి ఘటనల ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. సత్వర విచారణ చేపట్టి, నిర్ధారణ జరిపి.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలి.

-కే లలిత, నిరుద్యోగి

Skill Hub : నిరుద్యోగుల‌కు స్కిల్ హ‌బ్ ఉపాధి.. ఈ కోర్సుల్లోనే శిక్ష‌ణ‌..

క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రి..

తప్పుడు ధ్రువపత్రాలతో అర్హత లేని వారు ఉద్యోగాలు పొందారు. ఈ అంశంపై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపాలి. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయిన ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలి. మూత పడిన స్కూళ్ల ద్వారా ఈ నకలీ సర్టిఫికెట్ల దందా సాగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి.

-ఏ సునీత, నిరుద్యోగి

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Dec 2024 04:34PM

Photo Stories