Skip to main content

Free Training in Tally Course: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ 35రోజుల పాటు Tallyలో ఉచిత శిక్షణ 15వేల జీతం కూడా..

Free Training in Tally Course
Free Training in Tally Course

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉన్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగుళూరులో కంప్యూటర్‌, Tally నైపుణ్యంపై ఉచిత శిక్షణతో పాటు నూరు శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్‌ ప్రతినిధి హరిప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

10వ తరగతి అర్హతతో SBI లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 25000: Click Here

టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ పాస్‌, ఫెయిల్‌ అయిన 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులకు బెంగుళూరులో 35 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.

ట్యాలీ ప్లస్‌ జీఎస్టీ, స్పోకెన్‌ ఇంగ్లిషు, కంప్యూటర్‌, కమ్యూనికేషన్‌, లైఫ్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌తో పాటు వర్క్‌ప్లేస్‌ ఎథిక్స్‌పై అత్యుత్తమ శిక్షణ కల్పిస్తామని వివరించారు. శిక్షణానంతరం వివిధ సంస్థల్లో నెలకు రూ.15వేలకు పైబడిన వేతనంతో నూరు శాతం ఉద్యోగాలను చూపిస్తామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు 90004 87423 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
 

Published date : 17 Dec 2024 08:43PM

Photo Stories