Skip to main content

RBI Governor Salary : ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌కు వ‌చ్చే జీతం తెలిస్తే షాక్ అవాల్సిందే.. ఇంకా వీరికి..

రెవెన్యూ సెక్రటరీ నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌ అయిన సంజయ్‌ మల్హోత్రాకి ప్రభుత్వం చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
Salaries and allowance of rbi governor

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రభుత్వ సంస్థల్లో ఉన్న‌ అధిపతుల జీతాలు ఎంత ఉంటాయి..? వారికి జీతాలు పెరుగుతూనే ఉంటాయా..? ఎవ‌రికి ఎంతిస్తారు..? అనే సందేహాలు ప్ర‌జ‌ల్లో చాలానే ఉంటుంది. ముఖ్యంగా, కీలక ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ వేత‌నం, అలవెన్సులు ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎంతైనా ఉంటుంది. రెవెన్యూ సెక్రటరీ నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌ అయిన సంజయ్‌ మల్హోత్రాకి ప్రభుత్వం చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఆయనకు లభించే వసతి, జీతం, ఇతర ప్రోత్సాహకాల గురించి ఇప్పుడు చూద్దాం.

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ అర్హతతో రూ.25వేల వేతనం..

ఇటీవలే, డిసెంబరు 10తో శక్తికాంత దాస్ పదవీ కాలం పూర్త కావ‌డంతో, ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాని భారత ప్రభుత్వం నియమించిన సంగ‌తి తెలిసిందే. అయితే, 1990 రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మల్హోత్రా.. రాబోయే మూడేళ్లపాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా వ్యవహరించ‌నున్నారు. 

ఆర్‌బీఐ గవర్నర్ జీతం, ప్రయోజనాలు..

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్ సంబ‌య్ మ‌ల్హోత్రాకు నెల జీతంగా రూ.2.5 లక్షల ఉంటుంది. అలవెన్సులతో కలిపి ఈ మొత్తం రూ. 2.87 లక్షలకు చేరుకుంటుంది. అంటే, ప్రభుత్వ కార్యదర్శికి సమానంగా వేతనం పొందుతారు. జీతం కాకుండా గవర్నర్‌కు మ‌రికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇందులో, ఉచిత నివాసం, డ్రైవర్‌తో కూడిన కారు, వైద్య సదుపాయాలు వంటివి ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా ఉన్నవారికి అధికారిక నివాసం కేటాయిస్తారు.

Regularizing Employees : ఈ ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేసిన త‌ర్వాతే...

భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన ముంబైలోని మలబార్ హిల్‌లో ఈ విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆ ఇంటిని అమ్మకానికి పెడితే దాని విలువ రూ.450 కోట్లు ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఒక పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. అలానే, భారత ప్రభుత్వం అందించే పెన్షన్ ప్రయోజనాలు కూడా ఇందులో భాగ‌మే.

మాజీ గ‌వ‌ర్న‌ర్ల‌కు కూడా..

ఆసక్తికరంగా ఉర్జిత్ పటేల్ పదవీకాలంలో 2016 సవరణ నుంచి ఈ పే స్కేల్‌ మారలేదు. డిప్యూటీ గవర్నర్లు నెలకు రూ.2.25 లక్షల బేసిక్ జీతం పొందుతారు. గవర్నర్ వీరికంటే దాదాపు రూ. 31,500 ఎక్కువే పొందుతారు. సంజయ్‌ మల్హోత్రాకి ముందు పని చేసిన మాజీ గవర్నర్లు శక్తికాంత దాస్, ఉర్జిత్ పటేల్ కూడా వారి పదవీకాలంలో రూ.2.5 లక్షల నెల జీతం పొందారు.

1935లో ఏర్పాటైన ఆర్‌బీఐకి ఇప్పటి వరకు 25 మంది గవర్నర్‌లుగా పని చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Dec 2024 03:39PM

Photo Stories