CLAT Notification: క్లాట్‌తో వివిధ నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు.. పరీక్ష తేదీ!
సాక్షి ఎడ్యుకేషన్: నేటి కార్పొరేట్ యుగంలో.. న్యాయవిద్య కొత్త రూపు సంతరించుకుంటోంది. దీంతో లా కోర్సులతో కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. అందుకే ఇటీవల కాలంలో న్యాయ విద్యపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే దేశంలోని ప్రముఖ న్యాయ విద్య సంస్థలైన c వీటిలో ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి మార్గం..కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). తాజాగా క్లాట్(యూజీ)–2025 పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. క్లాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు..
TES Course Training: ఇండియన్ ఆర్మీలో టీఈఎస్ కోర్సు శిక్షణలో ప్రవేశాలు..
24 నేషనల్ లా యూనివర్సిటీలు
నాణ్యమైన న్యాయ విద్య కోర్సులను అందించడంలో నేషనల్ లా యూనివర్సిటీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ఏర్పాటైన 24 నేషనల్ లా యూనివర్సిటీలు అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో లా కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక కన్సార్టియంగా ఏర్పాటై ప్రతి ఏటా క్లాట్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. 2025 విద్యాసంవ్సతరానికి సంబంధించి క్లాట్–2025 పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 1న జరపనున్నట్లు ప్రకటించారు.
ప్రవేశాలకు క్లాట్
నేషనల్ లా యూనివర్సిటీలు అయిదేళ్ల బీఏ
ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)–యూజీని, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం క్లాట్ పీజీ ఎంట్రన్స్‌లను నిర్వహిస్తున్నారు.
Apprentice Posts: జమ్మూ–కశ్మీర్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు..
అర్హతలు
- క్లాట్–యూజీ: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- క్లాట్–పీజీ: ఎల్‌ఎల్‌బీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45%మార్కులు సాధించాలి.
క్లాట్–యూజీ పరీక్ష
క్లాట్–యూజీ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 22–26 ప్రశ్నలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 28–32 ప్రశ్నలు, లీగల్ రీజనింగ్ 28–32 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 22–26 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10–14 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ విభాగంలోనూ గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.
TCIL Recruitment: టీసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ పోస్టులు..
120 మార్కులకు క్లాట్–పీజీ
నేషనల్ లా యూనివర్సిటీల్లోని ఎల్‌ఎల్‌ఎం సీట్ల భర్తీకి క్లాట్–పీజీ పరీక్షను 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. వీటిని ప్యాసేజ్ ఆధారితంగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుగా అడుగుతారు. ఈ పరీక్షలో కాన్‌స్టిట్యూషనల్ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
కార్పొరేట్ కొలువులు
క్లాట్‌లో విజయంతో నేషనల్ లా యూనివర్సిటీల్లో అడుగుపెట్టి కోర్సులు పూర్తి చేసుకున్న వారికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. వీరు న్యాయవాద వృత్తితోపాటు కార్పొరేట్ కొలువులు సైతం దక్కించుకోవచ్చు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో కన్సల్టింగ్ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, ఇతర కార్పొరేట్ కంపెనీలు సగటున రూ.10 లక్షల వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి.
IITM Recruitment: ఐఐటీఎంలో ప్రాజెక్టు పోస్టులకు దరఖాస్తులు..
ముఖ్య సమాచారం
- క్లాట్–2025 పరీక్ష తేదీ: 2024, డిసెంబర్ 1
- నోటిఫికేషన్: జూలైలో మొదటి వారంలో వెలువడే అవకాశం.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- వివరాలకు వెబ్‌సైట్: జ్టి్టpట://ఛిౌnటౌట్టజీuఝౌజn uట.్చఛి.జీn
బెస్ట్ స్కోర్ సాధించాలంటే
క్లాట్ యూజీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఇందులో ఉండే అయిదు సెక్షన్లలోనూ మెరుగైన ప్రతిభ చూపేలా ఇప్పటినుంచే సన్నద్ధత కొనసాగించాలి. అందుకోసం సబ్జెక్ట్‌ల వారీగా సిలబస్ అంశాలపై దృష్టిపెట్టాలి.
కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్
సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీంతోపాటు అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.
Mohammad Mokhber: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన మహమ్మద్ మొఖ్బర్
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించడానికి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. అదే విధంగా.. కాంప్రహెన్షన్, ప్యాసేజ్ రీడింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్ సారాంశాన్ని గ్రహించడం, ప్యాసేజ్ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవడం వంటి నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. ఇందుకోసం జనరల్ ఎస్సేలు, న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య ప్రచురణలు చదవాలి.
లాజికల్ రీజనింగ్
తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో రాణించేందుకు సిలాజిజమ్, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
Boeing Aero Space: బోయింగ్ ఏరోస్పేస్ ట్రైనింగ్‌కు ఎంపికైన పాలిటెక్నిక్ విద్యార్థులు
క్వాంటిటేటివ్ టెక్నిక్స్
ఈ విభాగంలో స్కోర్ కోసం పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అర్థమెటిక్‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి అభ్యర్థులు పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, యావరేజెస్, రేషియోస్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
లీగల్ రీజనింగ్
న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే ఉద్దేశంతో ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు,ఫ్యాక్ట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పెంచుకోవాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవాలి.
Assistant Professor Posts: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అర్హులు వీరే!
క్లాట్ పీజీ
క్లాట్ పీజీ పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు తాజాగా ముఖ్యమైన తీర్పులు తెలుసుకోవాలి. దీంతోపాటు రాజ్యాంగం, శాసనపరమైన అంశాలు, చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటివాటిపైనా అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు తాము ఎంపిక చేసుకోనున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి అకడమిక్‌గా బ్యాచిలర్ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం కూడా మేలు చేస్తుంది.