Skip to main content

Indian Army : ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు

ఇండియన్‌ ఆర్మీలో జూలై 2025లో ప్రారంభమయ్యే 53వ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ (టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ పోస్టులకు ఉచిత శిక్షణ అందజేస్తారు.
Technical entry scheme admissions at Indian army  Indian Army  announcement for 53rd 10+2 TES course admissions

»    మొత్తం ఖాళీల సంఖ్య: 90.
»    అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్‌) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
»    వయసు: 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్‌) స్కోరు, స్టేజ్‌–1, స్టేజ్‌–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    కోర్సు, శిక్షణ: మొత్తం ఐదేళ్ల కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ , కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్‌) డిగ్రీ అందజేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.11.2024
»    వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

TGPSC Group 1 Mains: గ్రూప్‌–1 హాల్‌టికెట్లు విడుద‌ల‌.. మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ.. 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Oct 2024 12:23PM

Photo Stories