TGPSC Group 1 Mains: గ్రూప్–1 హాల్‌టికెట్లు విడుదల.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..
మొదటి పరీక్ష ప్రారంభమయ్యే సమయం వరకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ రాత పరీక్షలు (కన్వెన్షియల్/డిస్క్రిప్టివ్ టైప్) జరగనున్నాయి.
563 పోస్టుల కోసం..
18 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్.. గత నెలలో ఫలితాలు విడుదల చేసి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29కు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలి..
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు.. ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని కమిషన్ సూచించింది. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150.
జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా మిగతా ఆరు పరీక్షలకు.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారం భాషను ఎంచుకుని జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు పరీక్షలను కూడా ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదు. అలా రాస్తే పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లిష్ పేపర్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దాని మార్కులను ర్యాంకింగ్‌లోకి తీసుకోరు. అభ్యర్థులు అన్ని పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క పరీక్ష రాయకున్నా అనర్హతకు గురవుతారు.
అరగంట ముందే పరీక్ష కేంద్రాల మూసివేత మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదు. ఇక సమయం తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష హాళ్లలో గడియారాలను ఏర్పాటు చేస్తారు.
హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సాంకేతిక సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040–23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని.. లేదా హెల్ప్‌డెస్క్‌ను ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని టీజీపీఎస్సీ సూచించింది. కాగా గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువడనుంది.
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..
సబ్జెక్టు |
పరీక్ష తేదీ |
జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) |
21.10.2024 |
పేపర్–1, జనరల్ ఎస్సే |
22.10.2024 |
పేపర్–2, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ |
23.10.2024 |
పేపర్–3, ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ |
24.10.2024 |
పేపర్–4, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ |
25.10.2024 |
పేపర్–5, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ |
26.10.2024 |
పేపర్–6, తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ |
27.10.2024 |
(అన్ని పరీక్షలకు 3 గంటల సమయం ఇస్తారు. ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది) |
Tags
- TGPSC Mains 2024
- TSPSC Mains Exam 2024 Admit Card released
- Telangana State Public Service Commission
- Group I Services Mains Exam 2024 Hall Tickets
- Group I Mains Exam 2024 Hall Tickets Download
- TSPSC Group 1 Mains Exam Admit Card
- TSPSC Group 1 hall ticket
- TSPSC Group I Services Mains Exam
- Telangana News
- Tgpsc Group 1 Mains Syllabus
- Tgpsc Group 1 Mains Question Paper
- TGPSC Group 1 Mains News
- TSPSC Study Material
- TelanganaGroup1Mains
- TSPSCExamHallTickets
- Group1HallTicketDownload
- Group1MainsOctober
- TSPSCHallTickets
- sakshieducationlatestnews