Skip to main content

tspsc group 1 topper Anusha interview: గ్రూప్‌-1లో 524 మార్కులు..రోజుకు 5-6 గంటలు చదివేదాన్ని, నా ప్రిపరేషన్‌ స్ట్రాటజీ ఇదే..

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాల్లో 524 మార్కులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచారు అనూష. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఆమె ఏ విధంగా సన్నద్ధమయ్యారు?ఎలాంటి బుక్స్‌ చదివారు? స్టడీ ప్లాన్ ఎలా సాగేది మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్‌ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ..  
TGPSC Group 1 Topper Anusha Success Story   TGPSC Group-1 Mains topper Anushas interview In telugu
TGPSC Group 1 Topper Anusha Success Story TGPSC Group-1 Mains topper Anushas interview In telugu

🔹ముందుగా మీకు హృదయపూర్వక అభినందనలు. మీకు వచ్చిన మార్కులతో డిప్యూటీ కలెక్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా?

అనూష: అవునండి. డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ రావొచ్చు. 

🔹ముందుగా ఈ సక్సెస్‌ ఎలా అనిపిస్తుంది? మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది? 
అ: చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల కష్టం ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతిరోజూ 5-6 గంటలు చదివేదాన్ని. నా కష్టానికి ఇప్పుడు ఆనందంగా ఉంది. 

🔹ఎలాంటి బుక్స్‌ చదివేవాళ్లు? ప్రిపరేషన్‌ స్ట్రాటజీ గురించి చెప్పండి
అ: ప్రతిరోజూ న్యూస్‌పేపర్లు చదివేదాన్ని. వాట్నుంచి సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునేదాన్ని. కరెంట్ అఫైర్స్ కోసం రోజూ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ వార్తలు చదివి నోట్స్‌ రాసుకునేదాన్ని. తెలుగు అకాడమీ ,ఎన్‌సీఈఆర్టీ బుక్స్‌ చదివేదాన్ని. 

🔹ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, ప్రిపరేషన్‌ కోసం ఎలా సమయాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకున్నారు?
అ: నేను మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నా. ఆఫీస్‌ ముగిసిన వెంటనే పూర్తి సమయాన్ని ప్రిపరేషన్‌కే కేటాయించేదాన్ని. ప్రతిరోజూ 5-6 గంటలకు తప్పకుండా చదివేలా ప్లాన్‌ చేసుకున్నా. 

🔹గ్రూప్‌-1 ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు మీరిచ్చే గైడెన్స్‌ ఏంటి?
అ: ప్రిపరేషన్‌ను కశ్చితంగా ప్లాన్‌ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్, ఎస్సే రైటింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌ కూడా చాలా ముఖ్యం. 

Published date : 14 Mar 2025 10:34AM

Photo Stories