Skip to main content

Government Jobs Ranker Success Story : ఇలా చ‌దివి.. ఏకంగా 8 గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌ కొట్టానిలా... కానీ ఇంకా నా ల‌క్ష్యం ఇదే..!

తెలంగాణ‌లో ఇటీవ‌ల వివిధ ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు సంబంధించిన ఫ‌లితాలను విడుద‌ల చేస్తున్న విష‌యం తెల్సిందే.
udhay success story

ఈ ఫ‌లితాల్లో ఎంతో మంది నిరుద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు. ఇదే కోవ‌కు చెందిన‌... ఉదయ్ ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకం 8 ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించి.. ఔరా అనే చేశాడు. ఈ నేప‌థ్యంలో బజార్‌హత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన ఉదయ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
తెలంగాణ‌లోని బజార్‌హత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్‌- సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్‌.

అందులో నేను కూడా ఒక్కడిని...
2015లో బాసర ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ పూర్తి చేశా. 2017 నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. అదే సంవత్సరం బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా అప్పటి ఐఏఎస్‌ అధికారులు బి.గోపి, వల్లూరి క్రాంతిల చొరవతో కలెక్టర్‌ ప్రత్యేక నిధుల నుంచి పది మందిని హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్‌ సెంటర్లో జాయిన్‌ చేశారు. అందులో నేను కూడా ఉన్నాను. అక్కడ ఏడాది పాటు శిక్షణ తీసుకున్నా. అనంతరం ఇక్కడికి వచ్చా. అప్పటి నుంచి స్టడీ సర్కిల్‌లో రెగ్యులర్‌గా ప్రిపేరవుతున్నా. 

☛➤ TGPSC Groups Topper Success Story : మాది పేద కుటుంబం.. ఇలా చ‌దివి.. వ‌రుస‌గా 4 గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్ సాధించానిలా.. కానీ..!

వ‌ర‌స‌గా ఉద్యోగాలు కొట్టానిలా...
2019లో వీఆర్వో ఫలితాల్లో జిల్లాలో మూడో ర్యాంకు సాధించాను. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించాను. ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్‌ ఫలితాల్లో ఐదో ర్యాంకు కొట్టాను. ఎస్‌ఎస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌లో పోస్టల్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాను. 2023లో సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా సెలక్ట్‌ అయ్యాను. 2024లో గ్రూప్‌-4 ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించి ఆదిలాబాద్‌ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ప్రస్తుతం జూనియర్‌ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. అలాగే ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో 360 మార్కులు.., గ్రూప్‌-2లో రాష్ట్రస్థాయి 51వ ర్యాంకు, గ్రూప్‌-3లో 74వ ర్యాంకు సాధించాను.

☛➤ UPSC Civils Success Plans : యూపీఎస్సీ సివిల్స్ కొట్టాలంటే... ఈ టాప్ ర్యాంక‌ర్లు చెప్పినవి పాటిస్తే చాలు...!

నా ల‌క్ష్యం ఇదే...!
నా విజ‌యంకు అధ్యాపకుల గైడెన్స్‌ ఉపకరించింది. గ్రూప్‌-1లో మెరిట్‌ ఉన్నా గ్రూప్‌ 2, గ్రూప్‌-3లలో తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా తదుపరి లక్ష్యం సివిల్స్‌. ఆ దిశగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నా. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమే గగనమైన ప్రస్తుత తరుణంలో ఏకంగా ఎనిమిది కొలువులు సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

Published date : 23 Mar 2025 05:51PM

Photo Stories