Skip to main content

TTD Jobs Notification : టీటీడీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే...! ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ వివిధ‌ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది.
ttd jobs notifications announcement   Tirumala Tirupati Devasthanam Trust Board meeting  TTD decision to fill various posts Tirumala Trust recruitment announcement  Tirumala Devasthanam new job openings

ఈ మేరకు పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌మావేశంలో TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, ఉన్నతోద్యుగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వీటిలో ఒకటి TTDలో ఉద్యోగాల భర్తీ. 

☛➤ Employee Salary Increase : ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక కనీస వేతనం రూ. 30 వేలు.. ఎలా అంటే...?

ఈ నియామకాల భ‌ర్తీకి TTD గ్రీన్ సిగ్నల్...
వైద్య సిబ్బంది నియామకానికి TTD గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య విభాగంలో ఎలాంటి ఖాళీలు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయాలని TTD పాలకమండలి నిర్ణయించింది. ముఖ్యంగా స్వామివారిపై భక్తితో కాలినడకన ఏడుకొండలెక్కి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని TTD భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డాక్టర్, నర్సింగ్, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. అంతేకాదు అత్యాధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని TTD పాలకమండని నిర్ణయించింది. 

☛➤ Government Jobs : ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కొత్త‌గా 13,000కుపైగా ఖాళీలు.. వీఆర్ఓలు, వీఆర్ఏలు..!!

258 మందిని కాంట్రాక్ట్ పద్దతిలో..
ఇక శ్రీవారి దర్శనంకోసం తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఉచితంగానే అన్నదానం చేసే విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నప్రసాద విభాగంలో సిబ్బందిని కూడా పెంచాలని TTD భావిస్తోంది. ఇందులో భాగంగానే 258 మందిని కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకోవాలని TTD పాలకమండలి తాజా సమావేశంలో నిర్ణయించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పోరేషన్ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. 

ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టుల‌ను..
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార‌ ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సెఫ్టి విభాగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సీనియర్  ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టును SLSMPC (Sri Lakshmi Srinivasa Manpower Corporation) కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు TTD పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇంకా వివిధ విభాగాల్లో ఖాళీల‌ను గుర్తించి అంచెఅంచెలుగా ఈ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు.

☛➤ APSRTC Jobs Notifications : ఏపీ ఆర్టీసీలో 11,500 ఉద్యోగాలు.. నోటిఫికేష‌న్ మాత్రం అప్పుడే..? కానీ ఈలోపు..

Published date : 28 Dec 2024 03:13PM

Photo Stories