Skip to main content

Telangana All Universities Jobs Notifications 2025 : ఈ 11 వర్సిటీల్లో... 2000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని అన్ని యూనివర్సిటీల్లో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ఉన్నత విద్యామండలి క‌స‌ర‌త్తు చేస్తోంది. తెలంగాణ‌లోని 11 వర్సిటీల్లో 2060 ఖాళీగా ఉన్నాయి.
Telangana All Universities Jobs Notifications 2025

ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. దీనికి తోడు కొత్తగా మహిళా వర్సిటీ ఏర్పాటు కావడం, పాలమూరులో న్యాయ, ఇంజినీరింగ్ కాలేజి రావడంతో మంజూరు చేయాల్సిన పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద వీసీల‌ సమావేశం ఉన్నందున వర్సిటీల్లో ఉమ్మడిగా ఉన్న సమస్యలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అప్పుడు నియామకాలపై చర్చసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

➤☛ Group 1 Ranker Success Story : సీడీపీఓ, గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా... నా స్టోరీ ఇదే..!

వచ్చే ఉద్యోగ క్యాలెండర్‌లో..
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు భర్తీ చేయకుండా వర్సిటీల స్థాయిని పెంచలేమని భావిస్తున్న ఛైర్మన్ బాలకిష్టారెడ్డి నియామకాలను వీలైనంత త్వరగా చేపట్టాలని, కనీసం 50 శాతం ఖాళీలను భర్తీ చేయాలని, వచ్చే ఉద్యోగ క్యాలెండర్‌లో చేర్చాలని సీఎంను కోరనున్నారు. నియామక విధానం ఏమిటన్న దానిపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. వందల మంది అభ్యర్థులను ముఖాముఖికి పిలిచే బదులు వడపోతకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించి తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరు, ముగ్గురిని పిలిస్తే మంచిదని భావిస్తున్నారు.

Published date : 24 Jan 2025 01:37PM

Photo Stories