Asha Workers Salary: ఆశవర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి

జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం వరకు జనవరి 12న సీఐటీ యూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే నివాసం ఎదుట ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బీఆర్‌ఎస్ నాయకులకు సమా చారం అందించారు.
అనంతరం కలెక్టరేట్‌లో ఏవో మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఆశవర్కర్లు 2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం ఎదుట వేలాది మందితో ధర్నా చేపట్టామన్నారు. అప్పటి హెల్త్ డైరెక్టర్ ఆశ వర్కర్ల ప్రతినిధులతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చారని గుర్తు చేశా రు.
ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి హామీ లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురా లు స్వరూప, నాయకులు నవీన, దేవి, పూజ, భారతి, వనిత, లక్ష్మి, సునీత పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |