Skip to main content

Free Courses and Job Offer : ఉచిత కోర్సుల‌తో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హ‌త‌లు త‌ప్ప‌నిస‌రి..

నిరుద్యోగులకు ఇది పెద్ద శుభ‌వార్త‌.. ఎందుకంటే, చ‌దువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం వేచి చూస్తున్న‌వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు ఉచిత కోర్సుల‌తో ముందుకొచ్చింది.
Training programs for unemployed graduates in various courses   Free job training courses available for those seeking employment  Free data engineering courses with job opportunity  Free courses offered to unemployed graduates for job opportunities

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగులకు ఇది పెద్ద శుభ‌వార్త‌.. ఎందుకంటే, చ‌దువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం వేచి చూస్తున్న‌వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు ఉచిత కోర్సుల‌తో ముందుకొచ్చింది. వివిధ‌ కోర్సుల్లో శిక్ష‌ణ అందించి, అర్హ‌త క‌లిగిన‌ కంపెనీల్లో ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేందుకు ఉచిత కోర్సులు అందిస్తోంది.

3 నెల‌లు.. 4 కోర్సులు

వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ అందించేందుకు శ్రీసత్యసాయి సేవా ఆర్గనైజేషన్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌నను జారీ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ఆధారంగా, అభ్య‌ర్థుల‌కు పైథాన్, ఎస్‌క్యూఎల్, పవర్‌ బీ, సాఫ్ట్‌స్కిల్స్‌లో 3 నెలల శిక్ష‌ణ‌ హైదరాబాద్‌లోనే ఉంటుందన్నారు. ఈ కోర్సుల్లో ఉన్న‌త కంపెనీల నిపుణులే శిక్ష‌ణ అందిస్తార‌ని పేర్కొన్నారు.

CUET PG 2025 Applications Last Date : సీయూఈటీ 2025 ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తులు.. మ‌రో రెండు రోజులే.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే..

అంతేకాకుండా, శిక్ష‌ణ‌లో ఎంపిక విధానం కూడా ప‌రీక్ష ఆధారంగానే ఉంటుంద‌ట‌. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన‌వారినే ఎంపిక చేస్తారు. కాగా, వారు శిక్ష‌ణ పూర్తి అయ్యేవ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే వారి వ‌స‌తి ఏర్పాటు చేసుకోవాల‌ని కోరారు.

విద్యార్హ‌త‌లు..

గ్రాడ్యువేష‌న్ లో బీఎస్సీ, బీటెక్ పూర్తి చేసుకున్న‌వారు, మాస్ట‌ర్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంసీఏ పూర్తి చేసుకున్న‌వారు అర్హుల‌ని వివ‌రించారు. చ‌దువు పూర్తి చేసుకున్నవారు, అర్హ‌త ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌న్నారు. ఈ మెర‌కు వ‌చ్చే నెల‌ ఫిబ్ర‌వ‌రి 5వ తేదీలోగా ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేసుకోవాల‌న్నారు. మ‌రిన్ని వివ‌రాల కోసం 9052372023 నంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 11:53AM

Photo Stories