Half Day Schools : వచ్చేనెలలో హాఫ్ డే స్కూల్స్.. రెండు రాష్ట్రాల్లో..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప్రతీ రోజు ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, బయట వ్యాపారాలు చేసుకునే వారు, ట్రాఫిక్ పోలీసులు ఇలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే, గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదు అయ్యింది.
దీంతో, విద్యార్థులకు ఈ ఎండల్లో ఎక్కువ తిరగడం, పాఠశాలల్లో అలసిపోవడం వారి ఆరోగ్యానికి సరికాదని, పాఠశాలల సమయం విషయంలో మార్పు చేయాలని, ఒంటిపూట బడులను నిర్వహించాని, ఇది మార్చి తొలి వారంలోనే ప్రారంభించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ, రాష్ట్ర సర్కార్ పాఠశాలలకు ఒంటిపూట బడులను ప్రకటిస్తూ.. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం అని, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వారి పాఠశాల సమయం ఉంటుందని తెలిపింది పాఠశాల విద్యాశాఖ.
రెండు తెలుగురాష్టాల్లో..
ఇకపోతే, ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఒంటి పూట బడుల నిర్వహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇక, దీనిపై కూడా రాష్ట్ర సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొద్ది రోజుల నుంచి తీవ్ర ఎండలు ఉండగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోవడంతో సర్కార్ త్వరగా తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాలు. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- half day schools
- AP government
- students health and education
- Summer Schools
- school timings changes
- parents and teachers
- Half Day schools in AP
- School Education Department
- half day schools date announcement
- march 15th
- summer schools in ap
- half day schools for ap students
- telangana govt on half day schools
- half day schools latest updates
- ap and ts government
- half day schools in telugu states
- Education News
- Sakshi Education News