CUET PG 2025 Applications Last Date : సీయూఈటీ 2025 పరీక్షలకు దరఖాస్తులు.. మరో రెండు రోజులే.. ముఖ్యమైన వివరాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: ఉన్నత విశ్వ విద్యాలయాల్లో, కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వ విద్యాలయాల్లో పీజీ సీట్లు పొందేందుకు విద్యార్థులక ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష సీయూఈటీ.. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2025. ఈ పరీక్షలు డిగ్రీ పూర్తి చేసుకున్నవారు మాస్టర్స్ కోర్సుల్లో సీటు పొందేందుకు రాస్తారు.
అయితే, ప్రతీ ఏటా నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. అంటే, వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీన సీయూఈటీ 2025 పరీక్షలకు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ కాగా, అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ముఖ్య వివరాలు:
అర్హులు: డిగ్రీ పూర్తి చేసుకున్నవారు
విధానం: ఆన్‌లైన్‌లో.. అధికారిక వెబ్‌సైట్ నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2025
పరీక్షల తేదీ: మార్చి 13, 2025 నుంచి మార్చి 31, 2025
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు మొత్తం 157 సబ్జెక్టుల్లో ఉంటుంది. విద్యార్థులు సాధించే ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు పొందుతారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- CUET 2025
- PG Entrance Exam
- graduation students
- pg entrance exam 2025
- online applications for cuet
- pg universities and colleges
- post graduation courses
- PG courses Admissions
- admission test for pg 2025
- Common University Entrance Test
- cuet registration 2025 deadline
- pg entrance exam registrations
- eligible students for cuet 2025
- online examination for cuet 2025
- february 2nd
- march 2025
- pg courses admission test 2025
- 157 subjects for pg courses
- new academic year entrance exam
- Education News
- Sakshi Education News