UGC: మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష పెట్టుకోవచ్చు
Sakshi Education
న్యూఢిల్లీ: క్యూట్(కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) ఆధారంగా విద్యార్థులను జాయిన్ చేసుకున్న తర్వాత కూడా మిగిలే సీట్లపై వర్సిటీలకు యూజీసీ స్పష్టత ఇచ్చింది.
అర్హత పరీక్షలో మార్కుల ప్రాతిపదికన లేదా సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించుకుని ఆయా సీట్లను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది. మిగిలిన సీట్లను విద్యాసంవత్సరమంతా ఖాళీగా ఉంచడమంటే వనరుల వృథాయే కాదు..సెంట్రల్ వర్సిటీల్లో చదువుకోవాలని ఆశపడే విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను నిరాకరించడం కూడా అవుతుందని వ్యాఖ్యానించింది.
చదవండి: B Vinod Kumar: ఉత్తర తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్
క్యూట్‌కు హాజరై, కొన్ని కోర్సుల కోసం సంబంధిత వర్సిటీలకు దరఖాస్తు చేసుకోని వారి పేర్లను పరిశీలించుకోవచ్చని తెలిపింది.
Published date : 02 Aug 2024 01:16PM