Education Policy: ఉత్తమ విద్యే లక్ష్యంగా కొత్త విధానం
Sakshi Education
భైంసా: రాష్ట్రంలో ఉత్తమ విద్యే లక్ష్యంగా ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిష్టాత్మకమైన విధానాన్ని తీసుకురానున్నట్టు రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు.
ఆయన నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని డిసెంబర్ 5న సందర్శించారు. వర్సిటీ అడిటోరియం, కబడ్డీ కోర్టు, టెన్నిస్, ఖోఖో క్రీడా మైదానాలను పరిశీలించారు. అనంతరం వంటగదులు, వంటపాత్రలు, భోజనశాల, విద్యార్థుల తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించారు.
చదవండి: Class 10 and 12 Exams Guidance: 10, 12 తరగతుల.. వార్షిక పరీక్షలు.. బెస్ట్ స్కోర్ ఇలా!
అనంతరం విద్యార్థులతో భేటీ అయ్యారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌తోపాటు ఆయా విభాగాల ఇన్‌చార్జిలు, అధ్యాప కులతో ముఖాముఖి నిర్వహించారు. ట్రిపుల్‌ఐటీలో అందుతున్న కోర్సులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు, అంశాలను ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ వివరించారు.
Published date : 06 Dec 2024 01:39PM