Foreign Education : విస్తృత విద్యావకాశాలకు ఆస్ట్రేలియా.. ఉన్నత నైపుణ్యాలకు అవకాశం..

అమరావతి: ఉన్నత చదువులంటే విద్యార్థులు మొగ్గు చూపేది విదేశాల్లోనే ఎక్కువ శాతం. అలాగే, భారతీయ విద్యార్థులకు కూడా విదేశీ విద్య ప్రధాన్యత ఎక్కువ. ఈ కోణంలో ఆస్ట్రేలియాలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, రీసెర్చ్ ఆధారిత కోర్సుల ఫలితంగా వారిలో నైపుణ్యాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని.. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రభుత్వ అధినేత) పీటర్ మలినౌస్కస్ తెలిపారు. అదే విధంగా వీసా నిబంధనలు కూడా కఠినంగా లేవని చెప్పారు.
కొత్త అంశాలపై ఆసక్తి..
బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్టడీ అడిలైడ్ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియాలో ఆర్‌అండ్‌డీ, టెక్, సైన్స్, హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్ విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత విద్యార్థులు కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇదే వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలు టాప్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రవేశాలు పొందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్స్ కూడా లభిస్తాయి’ అని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)