Richest Man in the World: ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ధనవంతుడు ఈయనే.. ఎలన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ లు కూడా ఇతను ముందు దిగదుడుపే!

అప్పట్లోనే ఆయన ధనాన్ని మోసేందుకు వందల మంది సిబ్బంది పనిచేసేవారు. ఇప్పుడు అంబానీల దగ్గర ఉన్న ఆస్తి అతనికి లెక్కలోకి కూడా రాదు. అతని పేరు మాన్సా మూసా. అతను ఒక ఆఫ్రికన్ రాజు. ఇప్పటివరకు భూమి పై జీవించిన మనుషుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే.
ఇంతవరకు ఇతని ఆస్తిని దాటి సంపాదించిన వారు లేరు. ఆఫ్రికాలో ప్రస్తుతం పేద దేశంగా ఉన్న మాలి... ఒకప్పుడు మాన్సా మూసా రాజ్యం. దాన్ని టింభక్తు అని పిలిచేవారు. 2000 మైళ్ల పరిధిలో ఈ టింభక్తు రాజ్యం ఉండేది. వందల ఏళ్ల క్రితం ఈ రాజ్యాన్ని మాన్సా మూసా పాలించాడు.

చదవండి: Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతికి ప్రపంచ కుబేరుడు నామినేట్.. ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీరే!
మాన్సా మూసా రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు అతని దేశంలో బంగారు గనులు అధికంగా ఉండేవి. అలాగే ఉప్పునిక్షేపాలు ఉండేవి. వాటిని ఆయన తన తెలివితో ఎగుమతి చేసి వేలరెట్లు ఆస్తులను సంపాదించాడు. అలాగే ఏనుగు దంతాల వ్యాపారాన్ని కూడా చేసేవాడు.
![]() ![]() |
![]() ![]() |
ఇవన్నీ కూడా అధిక సంపదను తెచ్చిపెట్టాయి. అతని ఆస్తి దాదాపు 31 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత ఆస్తిని ఇప్పటివరకు ఎవరూ సంపాదించలేదు. ప్రపంచంలో ఉన్న బంగారంలో సగం మాన్సా మూసా దగ్గరే ఉండేదని అంటారు.

మాన్సా మూసా ఓసారి మక్కా ప్రయాణానికి వెళ్ళాడు. అది ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన ప్రయాణం. టింభక్తు నుంచి మక్కా వెళ్లాలంటే దాదాపు 2700 మైళ్ళు ప్రయాణించాలి. రాజ్యాన్ని తన కొడుక్కి అప్పగించి మక్కాకు బయలుదేరాడు మాన్సా మూసా.
తనతో పాటు 60 వేల మంది మగపని వారిని తీసుకెళ్లాడు. అలాగే 12,000 మంది బానిసలు కూడా వెళ్లారు. వీరంతా తమతో పాటు కిలోన్నర బంగారు కడ్డీలను మోసుకెళ్లారు. గుర్రాలు, ఒంటెలు, ఆహారం, వంట వాళ్లు ఇలా అధిక సంపదతో మక్కాకు ప్రయాణమై వెళ్ళాడు మాన్సా మూసా. అందుకే ఆ ప్రయాణం చరిత్రలో నిలిచిపోయింది. ఇంత ధనవంతుడి గురించి ఇప్పటికీ మాలీ దేశంలో కథకథలుగా చెప్పుకుంటారు.
