Jay Bhattacharya: అమెరికా హెల్త్ ఏజెన్సీ అధిపతిగా భట్టాచార్య

ఈ నియామకాన్ని యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.
జయ్ భట్టాచార్య ఎవరంటే.. ?
జయ్ భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రారంభమైంది, అక్కడ ఆయన 1997లో మెడిసిన్‌లో డాక్టరేట్ పొందారు. ఆ తర్వాత, ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ కూడా స్టాన్‌ఫోర్డ్‌లోనే పూర్తి చేశారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా పనిచేశారు మరియు నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా కూడా పనిచేశారు.
కరోనా సమయంలో భట్టాచార్య పాత్ర
కరోనా మహమ్మారి సమయంలో, అమెరికా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా జయ్ భట్టాచార్య విమర్శలు చేశారు. 2020లో ఆయన మరికొంత మంది విద్యావేత్తలతో కలిసి గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ ను ప్రచురించారు. ఈ డిక్లరేషన్ లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలనే పిలుపును ఇచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
Mark Carney: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్
అమెరికా ఆరోగ్య మంత్రిగా ఉన్న 71 ఏళ్ల రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, రాజకీయ కుటుంబ వారసుడు, ప్రసిద్ధ న్యాయవాది. ఆయన ప్రజలపై ప్రభావం చూపించే విధానాలు, కొవిడ్ వ్యాక్సిన్లపై ఆయన వ్యతిరేకతలతో వివాదాస్పదంగా ఉన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ రాజకీయాలలో, ఆహారం, రసాయనాలు, టీకాలపై తన వైఖరితో మరింత వెలుగు తీసుకున్నారు.
ట్రంప్ ప్రకటన
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్‌లో జయ్ భట్టాచార్యను ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించడానికి ప్రకటన చేశారు. ఆయన ఈ నియామకాన్ని సంబరంగా స్వీకరించారు. "భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపించి, దేశప్రజల ప్రాణాలను కాపాడే కీలక ఆవిష్కరణలు తీసుకురావడంలో సహాయపడతారని, ఆరోగ్య రంగంలో పెద్ద మార్పులను సాధించడానికి ఆయన కృషి చేస్తారని" అన్నారు.