Maneuver Warfare: విశాఖ వేదికగా నాలుగోసారి భారత్–అమెరికా యుద్ధ విన్యాసాలు

ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే విన్యాసాల్లో భారత్ తరఫున ఐఎన్‌ఎస్ జలాశ్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహిస్తోంది. వరుసగా నాలుగో పర్యాయం విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ త్రివిధ దళాల విన్యాసాలను ‘టైగర్ ట్రయాంఫ్’ గా పిలుస్తుంటారు.
2019 నుంచి ప్రారంభం
భారత్, అమెరికాల్లో సైనిక, వైమానిక, నౌకాదళ విన్యాసాలు వేర్వేరుగా జరిగాయి. కానీ 2019లో తొలిసారిగా..మూడు విభాగాలు కలిపి విన్యాసాల్లో ప్రప్రథమంగా పాల్గొనడంతో అన్ని దేశాలూ భారత్–అమెరికా మధ్య బంధం గురించి చర్చించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు, భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకారం, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి.
అనుమానాలను పటాపంచలు చేస్తూ..
ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల రక్షణ శాఖల అధికారులు సమావేశమై విన్యాసాలపై చర్చించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో..టైగర్ ట్రయాంఫ్ జరగదేమో అనుకున్నారంతా. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘టైగర్ ట్రయాంఫ్’– 4 ప్రారంభం కానుండటంతో ప్రధాన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Black Sea: సురక్షిత నౌకాయానానికి.. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఒప్పందం
టైగర్ ట్రయాంఫ్
వేదిక: విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం
ఎడిషన్: 4
ప్రారంభం: ఏప్రిల్ 02, 2025
లక్ష్యం
- ఇండో పసిఫిక్ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం
- ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయుధ సంపత్తి సత్తా చాటడం
- ఇండో–పసిఫిక్ జలాల్లో అక్రమ రవాణా, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.
విన్యాసాలు చేసేది.. వీళ్లే
- అమెరికా తరపున మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్‌లు
- భారత్ సైనిక దళం, నావికులు, ఎయిర్‌మెన్‌లు
- భారత్ తరపున ఐఎన్‌ఎస్ జలాశ్వ
- అమెరికా యుద్ధ నౌకలు