Exemplar: శిశు మరణాల నివారణలో భారత్ ప్రగతి శ్లాఘనీయం

ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య కార్యక్రమాలకు వ్యూహాత్మకంగా నిధులు కేటాయించడం ద్వారా దేశం లక్షల పసి ప్రాణాలను కాపాడగలిగిందని ఐరాస ‘ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ’ నివేదికలో పేర్కొంది.
శిశు మరణాల తగ్గింపు: 2000 నుంచి 2020 వరకు భారత్‌లో ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు 70% తగ్గాయని నివేదిక పేర్కొంది. నవజాత శిశు మరణాలు కూడా 61% తగ్గినట్లు తెలిపింది.
అధిక ప్రగతి సాధించిన దేశాలు: భారత్‌తో పాటు నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి దేశాలు కూడా ఈ రంగంలో ఆదర్శంగా నిలిచాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఆయుష్మాన్ భారత్ పథకం: ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఈ పథకం ఆరోగ్య సేవలకు మెరుగైన నిధులు కేటాయించడం ద్వారా శిశు మరణాల నివారణలో మంచి విజయాన్ని సాధించిందని పేర్కొంది.
సాధించిన విజయానికి కారణాలు: రాజకీయ సంకల్పం, సరైన వ్యూహం, నిరవధిక నిధుల కేటాయింపులు, ఆరోగ్య ప్రణాళికలు సరైన విధంగా అమలు చేయడం వల్ల శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
3D Printed Train: ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్.. ఎక్కడంటే..