Rythu Bharosa: ఎకరంలోపు భూములున్న రైతులకు ‘తొలి’ భరోసా

రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది.
జనవరి 26వ తేదీ రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.593 కోట్లు జమ చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 21.45 లక్షల రైతులకు 1,126.54 కోట్లు పంపిణీ చేయబడ్డాయి.
72 లక్షల మందికి పైగా రైతులకు..
రాష్ట్రంలో 72 లక్షల మంది రైతుల వద్ద కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయి. ఈ భూములకి రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Welfare Schemes: తెలంగాణలో నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అమలు.. ఆ పథకాలు ఇవే..
ఫిబ్రవరి 5వ తేదీ ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులివ్వగా, ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు.
వ్యవసాయ యోగ్యమైన భూముల సర్వే
రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు వ్యవసాయ యోగ్యం కానివిగా గుర్తించబడ్డాయి. రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చాయి.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు, రుణమాఫీ, రైతు భీమా పథకాలలో 7,625 కోట్లు, 20,616.89 కోట్లు మరియు 3,000 కోట్లు చెల్లించింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.
WEF in Davos: తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాలు