Skip to main content

Nobel Peace Prize: నోబెల్‌ శాంతి బహుమతికి ప్రపంచ కుబేరుడు నామినేట్‌.. ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీరే!

లండన్‌: నోబెల్‌ శాంతి బహుమతి–2025కి ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌ అయ్యారు ఈ మేరకు నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీకి ఒక పిటిషన్‌ సమర్పించినట్లు యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.
Elon Musk Nominated For Nobel Peace Prize

ప్రపంచ ప్రఖ్యాత బహుమతికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడటానికి ఆయన చేసిన కృషికి ఒక గుర్తింపు అని వెల్లడించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్‌ మస్క్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

చదవండి: Educational Qualifications Of Richest People: ప్రపంచంలోనే టాప్‌-10 ధనవంతులు.. ఏం చదువుకున్నారో తెలుసా?

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీరే!

  • ఎలోన్ మస్క్ (Elon Musk):

    • నికర విలువ: సుమారు $229 బిలియన్లు
    • కంపెనీలు: టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ (SpaceX), ఎక్స్ (X)
  • బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault):

    • నికర విలువ: సుమారు $173 బిలియన్లు
    • కంపెనీ: ఎల్‌విఎంహెచ్ (LVMH)
  • జెఫ్ బెజోస్ (Jeff Bezos):

    • నికర విలువ: సుమారు $114 బిలియన్లు
    • కంపెనీ: అమెజాన్ (Amazon)
  • లారీ ఎల్లిసన్ (Larry Ellison):

    • నికర విలువ: సుమారు $107 బిలియన్లు
    • కంపెనీ: ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation)
  • వారెన్ బఫెట్ (Warren Buffett):

    • నికర విలువ: సుమారు $106 బిలియన్లు
    • కంపెనీ: బెర్క్‌షైర్ హాథవే (Berkshire Hathaway)
  • బిల్ గేట్స్ (Bill Gates):

    • నికర విలువ: సుమారు $104 బిలియన్లు
    • కంపెనీ: మైక్రోసాఫ్ట్ (Microsoft)
  • లారీ పేజ్ (Larry Page):

    • నికర విలువ: సుమారు $122 బిలియన్లు
    • కంపెనీ: గూగుల్ (Google)
  • స్టీవ్ బాల్మర్ (Steve Ballmer):

    • నికర విలువ: సుమారు $116 బిలియన్లు
    • కంపెనీ: మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ
  • సెర్గీ బ్రిన్ (Sergey Brin):

    • నికర విలువ: సుమారు $116 బిలియన్లు
    • కంపెనీ: గూగుల్ (Google)
  • మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg):

    • నికర విలువ: సుమారు $108 బిలియన్లు
    • కంపెనీ: మెటా (Meta), ఫేస్‌బుక్ (Facebook)
Published date : 31 Jan 2025 01:53PM

Photo Stories