AI International Seminar : తెలంగాణ యూనివర్సిటీలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో AIపైన ఇంటర్నేషనల్ సెమినార్...

డిచ్‌పల్లి, తెలంగాణ: తెలంగాణ యూనివర్సిటీ (తెయూ) మార్చి 21 నుండి 25 వరకు అంతర్జాతీయ సెమినార్ నిర్వహించనుందని కన్వీనర్ మామిడాల ప్రవీణ్ వెల్లడించారు. సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వైస్ ఛాన్స్‌లర్ టీ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం. యాదగిరి బుధవారం ఆవిష్కరించారు.
ఈ ఐదు రోజుల సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, సెల్ఫ్ కేర్ వంటి ప్రస్తుత కీలక అంశాలపై చర్చించనున్నారు. యునైటెడ్ వే హైదరాబాద్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించనున్నారు.
Telugu Language in Schools : ఇకపై పాఠశాలల్లో మాతృ భాష తప్పనిసరి.. సర్కార్ కీలక ఆదేశం!!
హార్వర్డ్ ప్రొఫెసర్ల పాల్గొననున్న ముఖ్యాంశాలు
ఈ సెమినార్‌లో "Reimagining Higher Education in India" అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రసంగించనున్నారు. పాల్గొననున్న హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు:
డాక్టర్ పావని
డాక్టర్ కాండీసీ
డాక్టర్ షోకి
డాక్టర్ గాబ్రియెల్
డాక్టర్ బెన్
డాక్టర్ డోరిస్
శ్రేయ అలెగ్జాండర్
ఈ సెమినార్‌లో AI ఆధారిత విద్యా పరిజ్ఞానం, భారతదేశంలో ఉన్నత విద్యలో మార్పులు, స్వీయ సంరక్షణ వంటి అంశాలపై ప్రఖ్యాత విద్యావేత్తలు మార్గదర్శనం చేయనున్నారు.
సదస్సు నిర్వహణలో వైస్ ప్రిన్సిపాల్ ఎం. సత్యనారాయణ రెడ్డి, పీఆర్‌వో డైరెక్టర్ ఏ. పున్నయ్య, నాగరాజు, సంపత్, జమీల్ అహ్మద్, దత్తహరి తదితరులు భాగస్వామ్యులయ్యారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- artificial intelligence
- international seminar
- Telangana University
- higher education
- Reimagining Higher Education in India
- Harvard professors
- international seminar in telangana university
- March 21st
- higher education in ai
- artificial intelligence
- Educational knowledge
- Self-care
- higher education
- Education News
- Sakshi Education News