Skip to main content

TGPSC: ఈనెల 10న TGPSC గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

Telangana Public Service Commission
Telangana Public Service Commission

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు సంబంధించి షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 18 వరకు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ తెలిపింది.

10,954 రెవెన్యూ శాఖ ఉద్యోగాలకు లైన్‌ క్లియర్‌: Click Here

మార్చి 10న గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్‌ తుది పరిశీలన నిర్వహిస్తోంది.

ఫలితాల విడుదల షెడ్యూల్
మార్చి 10 - గ్రూప్‌-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.
మార్చి 11 - గ్రూప్‌-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
మార్చి 14 - గ్రూప్‌-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
మార్చి 17 - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.
మార్చి 19 - ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.
అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.

Published date : 10 Mar 2025 10:37AM

Photo Stories