CUET PG Final Answer Key 2024 Out: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ) పీజీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ 2024 ప్రవేశ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్,పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసుకొని కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్ pgcuet.samarth.ac.in ద్వారా అభ్యర్థులు ఆన్సర్ కీను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా సీయూఈటీ పీజీ 2024 పరీక్షలు మార్చి 11-28 వరకు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు, దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 4.62 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా,మొత్తం 75.14 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.సీయూఈటీ-2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి.
CUET PG 2024 ఫైనల్ ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
1. ముందుగా pgcuet.samarth.ac.in. వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
2. హోంపేజీలో కనిపిస్తున్న CUET PG 2024 ఫైనల్ ఆన్సర్ కీ పేజీపై క్లిక్ చేయండి.
3. మీ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలతో లాగిన్ అవ్వండి
4. లాగిన్ అవ్వగానే మీకు ఆన్సర్ కీ జాబితా కనిపిస్తుంది.
5. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Tags
- CUET PG 2024
- Final Answer Key
- CUET
- CUET PG 2024 Notification
- CUET PG 2024 Results
- CUET PG 2024 Answer Keys
- National Testing Agency
- Common University Entrance Test
- The Common University Entrance Test
- NTA Notification
- Central Universities admission
- CUETPG2024
- EntranceExam
- Common University Entrance Test
- Entrance Exams
- Official website