JEE Advanced : 2025 మే రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్!
జేఈఈ–మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా..జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 2025, మే రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ–కాన్పూర్.. అడ్వాన్స్‌డ్–2025 అర్హతల్లో మార్పులు చేస్తూ.. తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్–2025 తాజా మార్పులు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వాహక వర్గాలు.. విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు వీలుగా పరీక్ష విధానం, ఇతర నిబంధనల్లో మార్పులను ముందుగానే తెలియజేస్తున్నాయి. ఇది అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. అడ్వాన్స్‌డ్–2025 విషయంలోనూ కొన్ని మార్పులు చేశారు. దీంతో.. మరికొంత మందికి ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం లభించనుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మూడు అటెంప్ట్‌లకు అవకాశం
➾ జేఈఈ–అడ్వాన్స్‌డ్–2025 మార్పుల పరంగా ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. అటెంప్ట్‌ల సంఖ్యను పెంచడం! గరిష్టంగా మూడు అటెంప్ట్‌లు ఇచ్చే అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. 2023, 2024లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన వారు, అదే విధంగా 2025లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకూ అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభించనుంది.
➾ గత ఏడాది వరకు.. రెండు అటెంప్ట్‌లు రాసేందుకే వీలుండేది. అంటే పరీక్ష నిర్వహించే సంవత్సరంలో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించేవారు, అంతకుముందు సంవత్సరంలో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హత ఉండేది. అడ్వాన్స్‌డ్–2025కు మాత్రం పరీక్ష నిర్వహించే సంవత్సరానికి ముందు రెండేళ్లలో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నారు.
వయో పరిమితి యథాతథం
జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అటెంప్ట్‌ల సంఖ్య పరిమితిని పెంచినా.. వయో పరిమితి విషయంలో మాత్రం గతేడాది మాదిరిగానే నిబంధనలు అమలు చేయనున్నారు. అడ్వాన్స్‌డ్–2025కు జనరల్ కేటగిరీ అభ్యర్థులు అక్టోబర్ 1, 2000 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1995 తర్వాత జన్మించి ఉండాలి.
Fee Reimbursement 2024: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఆందోళన
మెయిన్స్ నుంచి 2.5 లక్షల మందికే
జేఈఈ–అడ్వాన్స్‌కు మెయిన్స్ ఉత్తీర్ణులను మాత్రమే ఎంపిక చేస్తారు. ఎప్పటి మాదిరిగా మెయిన్స్‌లో మార్కుల ఆధారంగా టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీలో 1,01,250 మందికి, జనరల్–ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25 వేల మందికి; ఓబీసీ (ఎన్‌సీఎల్) కేటగిరీలో 67,500 మందికి, ఎస్‌సీ కేటగిరీలో 37,500 మందికి; ఎస్‌టీ కేటగిరీలో 18,750 మందికి మెయిన్స్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది.
పరీక్ష విధానం ఇలా
జేఈఈ–అడ్వాన్స్‌డ్–2025 పరీక్షను రెండు పేపర్లుగా(పేపర్–1, పేపర్–2)గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్–1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రతి సబ్జెక్ట్‌లో మూడు సెక్షన్లుగా పరీక్ష ఉంటుంది. పేపర్–1ను 51 ప్రశ్నలతో 180 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–2ను కూడా 51 ప్రశ్నలతో 180 మార్కులకు నిర్వహిస్తారు. వాస్తవానికి గత మూడేళ్లుగా ప్రశ్నల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఈసారి కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు.
Faculty Posts : ఎన్‌ఐటీటీటీఆర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
జేఈఈ అడ్వాన్స్‌డ్–2025..
ముఖ్య సమాచారం
➾ 2023, 2024లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు సైతం పరీక్షకు హాజరయ్యే అవకాశం.
➾ రెండు పేపర్లుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ. n మే నెల రెండో వారం లేదా మూడో వారంలో పరీక్ష!
➾ జేఈఈ–మెయిన్ నుంచి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక.
➾ 23 ఐఐటీ క్యాంపస్‌లలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ కోర్సులు కలిపి మొత్తం 17,760 సీట్లు.
➾ 2025లో ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం.
సిలబస్‌పై పట్టుతోనే రాణింపు
రెండేళ్ల సిలబస్‌పై పట్టు
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 అభ్యర్థులు.. ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం రెండేళ్ల సిలబస్‌పై పట్టు సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హతగా పేర్కొన్న జేఈఈ–మెయిన్‌లో పలు అంశాలను తొలగించారు. కానీ..ఇవి జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో ఉంటాయి. విద్యార్థులు మెయిన్స్‌తోపాటు అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పరిశీలించి అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.
WII Recruitments : డబ్లూఐఐలో డైరెక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు
ప్రత్యేక సమయం
జేఈఈ–మెయిన్‌లో లేని అడ్వాన్స్‌డ్‌లో ఉన్న ప్రత్యేక అంశాలపై దృష్టి పెట్టాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత మెయిన్‌కు అదనంగా ఉన్న అంశాల రివిజన్‌కు సమయం కేటాయించాలి. అడ్వాన్స్‌డ్‌కు సిలబస్‌ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందే అవకాశం ఉంటుంది.
మ్యాథమెటిక్స్
ఈ సబ్జెక్ట్‌లో రాణించడానికి కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వీటితోపాటు 3–డి జామెట్రీ, కో ఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. ఆయా టాపిక్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
ఫిజిక్స్
న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ ఉండే ఈ విభాగంలో రాణించడానికి మెకానిక్స్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రో డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతమవుతాయి.
Job Apprortunities: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.. కావల్సిన అర్హతలివే!
కెమిస్ట్రీ
అభ్యర్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహారల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
అన్వయ దృక్పథం
అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. కాన్సెప్ట్‌లను అన్వయం దృక్పథంతో సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షలో అడిగే మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్, మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్ వంటి వాటికి సులభంగా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
ఆ రెండు పరీక్షలతో సమన్వయం
➾ అభ్యర్థులు బోర్డ్ పరీక్షలు, జేఈఈ–మెయిన్ పరీక్షతో సమన్వయం చేసుకుంటూ అడ్వాన్స్‌డ్ దిశగా అడుగులు వేయాలి. మెయిన్ తొలి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ ఎగ్జామ్ అంశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డ్ పరీక్షలకు సమయం కేటాయించాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు పూర్తి స్థాయి సమయం కేటాయించాలి. జేఈఈ–మెయిన్ రెండో సెషన్‌కు కూడా హాజరయ్యే అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ వాటికి సంబంధించి ప్రాక్టీస్ కొశ్చన్స్, ప్రీవియస్ కొశ్చన్స్‌ను సాధన చేసేలా సమయ పాలన రూపొందించుకోవాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
➾ ప్రతి వారం వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవుతూ లోటుపాట్లు సరిచూసుకుని వాటిని సరిదిద్దుకుంటూ అడుగులు వేయాలి.
➾ బోర్డ్ పరీక్షలు, మెయిన్ రెండో సెషన్ తర్వాత అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్ సమయంలో అప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత లోతైన అవగాహన పొందేలా కృషి చేయాలి.
➾ ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రాసుకునే విధానం అలవర్చుకోవాలి. ఫలితంగా రివిజన్ విషయంలో సమయం ఆదా చేసుకోవచ్చు.
Tags
- JEE Adv 2025
- Entrance Exams
- Exam preparation
- JEE Advanced Exam 2025
- notification for entrance exams
- iit and nit admissions
- JEE Exams 2025
- subjectwise preparation for jee
- IIT admissions
- Engineering
- Intermediate Students
- online applications for jee advanced
- Education News
- Sakshi Education News
- JEEAdvanced2025
- JEEAdvancedUpdates
- IITKanpurAnnouncements
- JEEExamTips
- JEE2025Updates