Job Apprortunities: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.. కావల్సిన అర్హతలివే!
Sakshi Education
హిందూపురం: స్థానిక ముక్కిడిపేట పాత ఎస్సీ బాలుర హాస్టల్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (ఎన్‌ఏసీ)లో నిరుద్యోగ యువతీయువకులకు ఎలక్ట్రీషియన్, ల్యాండ్ సర్వేయింగ్ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
Job Apprortunities For Unemployed Youth
ఈ మేరకు ఎన్‌ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు తమ బయోడేటాతో పాటు, ఆధార్ కార్డ్, విద్యార్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం 91105 50779లో సంప్రదించవచ్చు.