Skip to main content

CWC Recruitment Notification : సీడబ్యూసీలో 179 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ విద్యార్హ‌త‌తోనే..

ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌లో ముఖ్యంగా, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ‌లో ఉద్యోగం పొందాల‌నుకున్న యువ‌త‌కు ఇది మంచి అవ‌కాశం.
Job notification for recruitments at central warehousing corporation

సాక్షి ఎడ్యుకేష‌న్: సీడబ్యూసీ.. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భ‌ర్తీకి అధికారులు రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేష‌న్ ను కూడా విడుద‌ల చేశారు. ఈ సీడ‌బ్యూసీ రిక్రూట్‌మెంట్‌తో ఖాళీలుగా ఉన్న మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Faculty Jobs: ఎంజీయూ నల్గొండలో 14 పార్ట్‌టైమ్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

పోస్టుల వివ‌రాలు:

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్.

విద్యా అర్హత:

మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) - హెచ్‌ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, మార్కెటింగ్ లేదా సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్‌తో ఎంబీఏ డిగ్రీ ఉండాలి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) - ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి అగ్రికల్చర్, ఎంటమాలజీ, మైక్రోబయాలజీ లేదా సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

RCFL Recruitment 2024: పదో తరగతి అర్హతతో.. ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలో 378 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..

అకౌంటెంట్ - బీ. కామ్‌, సీఏ/ఐసీడ‌బ్యూఏ లేదా తత్సమాన అర్హత కనీసం మూడు సంవత్సరాల అనుభవం.

సూపరింటెండెంట్- ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- అభ్యర్థులు అగ్రికల్చర్, జువాలజీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీలో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి:

మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) - 28 సంవత్సరాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) - 28 సంవత్సరాలు

అకౌంటెంట్ - 30 సంవత్సరాలు

Apprenticeship Mela: రేపు అప్రెంటిస్‌షిప్‌ మేళా.. ఇంటర్వ్యూలో ఎంపికైతే నెలకు రూ.15,000/-

సూపరింటెండెంట్ - 30 సంవత్సరాలు

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 28 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ:

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఎంపిక క్రింది దశల ప్రకారం జరుగుతుంది.

రాత పరీక్ష: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

దరఖాస్తు రుసుము:

ఎస్సీ/ఎస్‌టీ, స్త్రీ, పీడ‌బ్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 500 (ఇంటిమేషన్ ఛార్జీలు)

జనరల్, ఓబీసీ, ఈడ‌బ్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 1,350 (దరఖాస్తు-సమాచార రుసుము)

ద‌ర‌ఖాస్తుల విధానం/చివ‌రి తేదీ: 

cewacor.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.
ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. 12 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Dec 2024 11:40AM

Photo Stories