Skip to main content

TGPSC Group-2 2024 : గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు భారీగా త‌గ్గిన హాజ‌రు శాతం.. కార‌ణం ఇదేనా..!

గ్ర‌ప్స్ ప‌రీక్ష‌లు రాసేందుకు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌ప్పుడు, హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకున్న‌ప్పుడు ఉన్న ఉత్సాహం అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ఉండ‌డం లేదు. ఈ విష‌యం ఇటీవ‌లె జ‌రిగిన గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో మ‌రింత‌ ఖ‌రారైంది.
Drastical drop of candidates attendance in tgpsc group 2 exam

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఏటా నిర్వ‌హించే గ్రూప్స్ ప‌రీక్ష‌లు ఉన్న‌త ప్ర‌భుత్వ ఉద్యోగాలు ద‌క్కించుకునేందుకు. ఈ ప‌రీక్ష‌లు రాసేందుకు ఎంద‌రో అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

TGPSC Group 2 Exam: గ్రూప్‌–2లో ఉమ్మడి జిల్లా ప్రస్తావన.. పేపర్‌ –4లోనూ..

గ‌తంలో అనేక సార్లు ఈ నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి అంత‌లోనే ర‌ద్దు చేశారు. కాని, ఈసారి అలా జ‌ర‌గ‌లేదు. చెప్పినట్టుగానే నోటిఫికేష‌న్ ఇచ్చి, ప‌రీక్ష‌ల‌ను కూడా ప‌క‌డ్బందీగా, ఉత్త‌మ ఏర్పాట్ల‌ను చేసి, విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. కాని, ఈసారి అభ్య‌ర్థులు అంత ఆస‌క్తి చూపించ‌లేదని తెలుస్తోంది.

రెండురోజుల‌కు 45 శాతం హాజ‌రు..

ఈ నెల డిసెంబ‌ర్ 15, 16వ తేదీల్లో నిర్వ‌హించిన టీజీపీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ రెండు రోజులు రెండు పేప‌ర్లుగా జ‌రిగింది. అయితే, 19,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్‌టికెట్ల‌ను కూడా చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాని, తొలి పేప‌ర్‌కు 9,070 మంది అభ్య‌ర్థులు, రెండు పేప‌ర్‌కు 9,020 మంది, మూడో పేప‌ర్‌కు 8,915 మంది, నాలుగో పేప‌ర్‌కు 8,911 మంది మాత్ర‌మే హాజ‌రైయ్యారు. ద‌ర‌ఖాస్తులో 20 వేల‌కు ద‌గ్గ‌ర‌లో ఉంటే హాజ‌రు సంఖ్య‌లో క‌నీసం 10 వేల‌కు ద‌గ్గ‌ర‌లో కూడా లేక‌పోవ‌డం చ‌ర్చినియాంశంగా మారింది. రెండు రోజుల్లో నిర్వ‌హించిన నాలుగు పేప‌ర్ల‌కు కేవ‌లం 45 శాతం హాజ‌రు ఉండ‌డం గ‌మ‌నార్హం.

Velichala Jagapathirao History : గ్రూప్‌-2 లో వెలిచాల జ‌గ‌ప‌తిరావు పేరుపై రెండు ప్ర‌శ్న‌లు.. ఆ చ‌రిత్ర ఇదే..

అయితే, ఇక్క‌డ గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించే విధుల్లో భాగంగా అనేక విద్యాసంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ సెల‌వును ప్ర‌క‌టించింది. ప‌రీక్ష రాసేందుకు అభ్య‌ర్థుల‌కు 63 సెంటర్లుగా పాఠ‌శాల‌ల్లో, క‌ళాశాల‌ల్లో కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు అధికారులు. అంతేకాకుండా, 12 రూట్లు ఏర్పాటు చేసి, ఆఫీసర్లకు వెహికల్స్​అరెంజ్​ చేశారు. ఇద్దరు రీజనల్​ ఇన్విజిలేటర్లు, ​ 63 మంది చొప్పున ఇన్విజిలేటర్లు, సిట్టింగ్​స్క్వాడ్​ను వందలాది పోలీసుల బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు.
స‌ర్కార్ కొలువు కొట్టేందుకు రాయాల్సిన ఈ ప‌రీక్ష‌ల‌కు అధికారులు ఎన్నో ఏర్పాట్లు చేసిన‌ప్ప‌టికీ, హాజ‌రు శాతం స‌గం కూడా ఉండ‌క‌పోవ‌డం గ‌మనార్హం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌వారు మాత్ర‌మే..

అప్ప‌ట్లో ఎంతో ఉత్సాహంగా, సర్కార్ కొలువు సాధించేందుకు గ్రూప్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థుల‌కు గత ప్రభుత్వం ప‌రీక్ష‌ నిర్వహణలో జాప్యం ​చేసింది. దీంతో ప‌రీక్ష రాయాల్సిన యువత నిరుత్సాహానికి లోనైంది. త‌రువాత‌, గ్రూప్​-1 ప్రిలిమ్స్ కు సంబంధించిన‌ ​రిజల్ట్స్ ను కూడా ప్ర‌భుత్వం​ రెండుసార్లు రద్దు చేసింది.

TGPSC Groups Results : టీజీపీఎస్సీ గ్రూప్స్-1,2,3 ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే.. త‌క్కువ స‌మ‌యంలోనే..!

దీంతో మరింత నిరాశ‌కు గురైయ్యారు అభ్య‌ర్థులు. ఈ కార‌ణంగా, కొంత‌శాతం అభ్య‌ర్థుల్లో ఆత్మ‌విశ్వాసం లోపం కావ‌డం, ప్రిప‌రేష‌న్‌లో లోపం ఉండ‌డం జ‌ర‌గ‌వ‌చ్చ‌ని కొందురు అంటున్నారు. మ‌రికొంద‌రు, ఎటువంటి ఆలోచ‌న‌ల‌కు గురి కాకుండా, కేవలం ప‌ట్టుద‌ల‌తో ప‌రీక్ష‌ను రాయాల‌నే ఆశ‌యంతో వ‌చ్చారిని ఇంకొంద‌రు అంటున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Dec 2024 12:54PM

Photo Stories