Skip to main content

TGPSC Group 1 Topper Success Story: ఐఏఎస్‌ కావాలన్న ఆశయంతో చదివా: దాది వెంకటరమణ

సాక్షి ఎడ్యుకేషన్: గ్రూప్‌–1 మెయిన్స్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ టాపర్‌గా నిలిచారు. 900 మార్కులకు గాను 535.50 మార్కులు సాధించారు.
TGPSC Group 1 Topper Dadi Venkataramana Success Story

తల్లిదండ్రులు దాది రమాదేవి ప్రధానోపాధ్యాయురాలు, తండ్రి శ్రీనివాసరావు కాంట్రాక్టు ఏఈగా ఈడబ్ల్యూఐడీసీలో పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం సూర్యాపేట కాగా.. ఉద్యోగ రీత్యా నల్లగొండలోని బృందావన్‌  కాలనీలో స్థిరపడ్డారు. వెంకటరమణ ఒకపక్క గ్రూప్‌–1 మెయిన్స్ కు ప్రిపేరవుతూనే మరోపక్క జూనియర్‌ లెక్చరర్, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు సాధించారు.

చదవండి: TGPSC Group 1 Topper Success Story: లక్ష్యంపై స్పష్టత, హార్డ్‌వర్క్‌తో విజయం: జిన్నా తేజస్విని రెడ్డి

ఐఏఎస్‌ కావాలన్నదే ఆశయం..

చిన్న నాటి నుంచే అమ్మనాన్న ప్రోత్సాహంతో ఐఏఎస్‌ కావాలన్న ఆశయంతో చదువుతూ వచ్చాను. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఈసీఈ పూర్తి చేశాను. 2020, 2021, 2022లో వరుసగా మూడుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాను. కానీ ఎంపికకాలేదు. ఆ తర్వాత గ్రూప్‌–1పై దష్టి సారించాను. ప్రస్తుతం ప్రకటించిన ఫలితాల్లో టాపర్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది.

పట్టుదలతో చదివేవాడు
వెంకటరమణ చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి చూపేవాడు. ఐఏఎస్‌ కావాలన్న ఆలోచనతో చదువుతూ వచ్చాడు. ఇప్పుడు గ్రూప్‌–1 ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు వస్తుంది. దీంతో ఐఏఎస్‌ కావాలన్న కోరిక ప్రస్తుతం కాకున్నా భవిష్యత్‌లో నెరవేరే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. 
– రమాదేవి, శ్రీనివాసరావు, వెంకటరమణ తల్లిదండ్రులు. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Mar 2025 04:28PM

Photo Stories