Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..
చదువును అశ్రద్ధ చేయకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. తొలుత టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత గ్రూప్-1 పోటీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం సాధించారు కొత్తపల్లి నర్సింహ. గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆయన సక్సెస్ స్టోరీ...
కుటుంబ నేపథ్యం :
మాది నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొండాపురం. అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. అన్న, అక్క కూడా వారికి చేదోడువాదోడుగా ఉండేవారు.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
ఎడ్యుకేషన్ :
నా చదువు ఏడో తరగతి వరకు స్థానికంగా ఉన్న స్కూల్లో, తర్వాత పదో తరగతి వరకు పక్క ఊరు పుల్లెంలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. 1998లో పదో తరగతి పూర్తయింది. మండల కేంద్రంలోని డాన్‌బోస్కో జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తిచేశాను. 2002లో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తయింది. అదే ఏడాది డీఎస్సీ రాసి జిల్లాలో అయిదో ర్యాంకు సాధించా. మా ఊరి పక్కనే ఉన్న తేరట్‌పల్లిలో టీచర్ పోస్టింగ్ లభించింది.
నా చిన్నతనంలోనే నా మీద దాదాపు రూ.50 వేల అప్పు భారం..
అమ్మానాన్న వ్యవసాయ కూలి పనులకోసం మిర్యాలగూడ వంటి ప్రాంతాలకు వెళ్ల్లేవారు. నేను కూడా వేసవి సెలవుల్లో, ఇతర పండుగ సెలవుల్లో ఆయా ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లేవాడిని. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే నా మీద దాదాపు రూ.50 వేల అప్పు భారం పడింది. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాను.
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
గ్రూప్-1 కి సెలెక్ట్ అయ్యానిలా..
2002లో టీచర్ ఉద్యోగం రావడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. దీంతో ఏదైనా సాధించగలననే నమ్మకం కలిగింది. ఉద్యోగం చేస్తూనే దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఎమ్మెస్సీ మ్యాథ్స్ ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు 2007లో గ్రూప్-1, 2లకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్స్ ప్రిపరేషన్‌కు ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చాను. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో 50 మార్కుల విభాగానికి మాత్రం కోచింగ్ తీసుకున్నాను. గ్రూప్-1లో డీఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. గ్రూప్-2లో ఏసీటీవో వచ్చింది.
అపోహకు దూరంగా ఉండాలి...
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలు చాలా కష్టమైనవిగా భావిస్తుంటారు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారే వాటిని సులువుగా సాధించగలరనే అపోహలో ఉంటారు. ముందు ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే ఏ పోటీ పరీక్షలో అయినా సులువుగా విజయం సాధించొచ్చు. గ్రూప్స్ వైపు అడుగులు వేసిన సమయంలో నాకు ఎలాంటి గెడైన్స్ లేదు. దినపత్రికలు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా వచ్చే మేగజైన్లలో ప్రచురితమయ్యే విజయగాథలు నాకు ప్రేరణ కలిగించాయి.
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
సొంతంగా ప్రిపరేషన్ సాగించినా..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మొదట సిలబస్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి. సిలబస్‌కు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రామాణిక పుస్తకాలు సేకరించుకోవాలి. కనీసం అయిదుసార్లు సిలబస్ పూర్తిచేయాలి. ఏకాగ్రతతో రోజుకు 10 గంటలు చదివితే సరిపోతుంది. ఇతర అభ్యర్థులతో చర్చిస్తూ చదవడం వల్ల అన్ని అంశాలు బాగా గుర్తుంటాయి. కోచింగ్ తీసుకుంటేనే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సాధ్యమని చాలామంది భావిస్తుంటారు. ఇది సరికాదు. ఎంతోమంది సొంతంగా ప్రిపరేషన్ సాగించి ఆయా పోటీ పరీక్షల్లో విజయం సాధించారు.
నా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ :
పదో తరగతి (1997-1998): 463/600
ఇంటర్మీడియట్(1998-2000): 757/1000
టీటీసీ (2000-2002)
డిగ్రీ (2002-2005)
పీజీ (2005-2007)