Skip to main content

UPSC Topper Success Story : ప‌ట్టు ప‌ట్టానిలా... యూపీఎస్సీలో టాప్‌ ర్యాంక్ కొట్టానిలా... కానీ ఫెయిల్యూర్‌తో..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్‌) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్‌ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్‌ ఇండియా ర్యాంక్‌ వన్‌ (ఏఐఆర్‌ 1) సాధించి, అనురాగ్‌ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.
UPSC Topper Anurag Gautam IES Success Story

పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్‌ గౌతమ్‌. ఈ నేప‌థ్యంలో అనురాగ్‌ గౌతమ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
అనురాగ్ గౌతమ్..  అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. 

ఎడ్యుకేష‌న్ :
అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్‌ స్కూలులో చదువుకున్నాడు. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై  అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తి చేసిన త‌ర్వాత‌.. అనురాగ్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 
తన కుమారుడు ఎన్‌టీఎస్‌ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. 

➤☛ Inspirational Story : మాది సంచార జాతి.. చిత్తు కాగితాలు ఏరి, భిక్షాటన చేసి చ‌దివి.. నేడు డీఎస్సీ ఉద్యోగం కొట్టానిలా... కానీ..

తొలి ప్రయత్నంలో విఫలమైనా..
అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్‌ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా  ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి  ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్‌ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు. అనురాగ్ సాధించిన  విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. 

☛➤ Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

ఫెయిల్యూర్‌కి బాధ ప‌డ‌కుండా... మ‌ళ్లి క‌సితో చ‌దివి..
ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు.  ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఫెయిల్యూర్‌కి బాధ ప‌డ‌కుండా... మ‌ళ్లి క‌సితో చ‌దివి.. దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ నేటి యువ‌త‌కు ఆద‌ర్శం.

Published date : 15 Dec 2024 04:05PM

Photo Stories