Skip to main content

Women Success Story : క్లాట్ ర్యాంక‌ర్‌గా 13 ప‌త‌కాలు.. తొలి ప్ర‌యాత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు.. మ‌రో టాలెంట్ ఇదే..

సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు.
Inspiring and success story of talented women

సాక్షి ఎడ్యుకేష‌న్: జీవితంలో ఏదైనా, ఎవ్వ‌రైనా ఎప్పుడైనా సాధించ‌వ‌చ్చు. ఒకవేళ‌, వారికి సాధించాలి అన్న త‌ప‌న‌, ప‌ట్టుద‌ల‌, అందుకు త‌గిన కృషి, ఆత్మ విశ్వాసం ఉంటే ఎంతటి విజ‌య‌మైన, ఎంత దూరంలో ఉన్న గమ్య‌మైనా, ఎన్ని అడ్డంకులు వ‌చ్చిన అనుకున్న ల‌క్ష్యానికి చేరుకోవ‌చ్చు. ఇలా, ఇప్ప‌టివ‌ర‌కు చాలామంది వారు అనుకున్న దారిలో న‌డిచి, గెలుపును అందుకొని, న‌లుగురికి ఆద‌ర్శంగా నిలిచారు. ఇందులో ఒక‌రే శ్ర‌ద్ధ‌. ఈ యువ‌తి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ది. అంత‌గా ఏం విజ‌యం సాధించింది అనుకుంటున్నారా..! ఒక‌టి రెండు కాదు అస‌లు ఈ యువ‌తి క‌థేంటో తెలుసుకుందాం..

Jobs at GIC : జీఐసీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెల రూ.85,000 జీతంతో పాటు.. ఇంకా..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్ర‌ద్ధ‌ గోమ్.. త‌న తండ్రి ఒక‌ రిటైర్డ్ ఎస్‌బీఐ, త‌ల్లి గ్రుహిణి. అయితే, చిన్న‌త‌నం నుంచే శ్ర‌ద్ధ‌కు చ‌దువంటే ఇష్టం. ఇండోర్‌లోని సెయింట్ రాఫెల్స్ హెచ్‌ఎస్ స్కూల్‌లో త‌న ప్రాథ‌మిక, ఇంట‌ర్ విద్య‌ను పూర్తి చేసుకుంది. ఇక్క‌డి వ‌రకూ అగ్ర‌స్థానంలో నిలుస్తూ వ‌చ్చింది.

క్లాట్ కోసం..

ఇంట‌ర్ వ‌ర‌కు అన్నింటిలోనూ అగ్ర‌స్థానంలో నిలిచింది. అనంత‌రం, త‌న‌కు న్యాయశాస్త్రంలో ఉన్న ఆశ‌కు,  ఇందులో ఉన్నత విద్యను పొందాల‌ని బావించి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) ప‌రీక్ష రాసి టాపర్‌గా నిలిచిన శ్ర‌ద్ధ‌, భారత్‌లోనే అత్యుత్తమ న్యాయ కళాశాలలో బెంగ‌ళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో అడ్మిష‌న్ ల‌భించింది. ఇక్క‌డ ఉన్న‌త విద్యాను పొంది, త‌న‌ అత్యుత్తమ ప్రతిభకు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర చేతులమీదుగా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలా, త‌న ప్ర‌యాణాన్ని గొప్ప స్పూర్తిదాయ‌కంగా ఏర్ప‌ర్చుకుంది.

Sr. Knowledge Manager Recruitment 2024: సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

సివిల్స్‌లో ఆశ‌క్తితో..

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా పనిచేసింది.  ముంబై, లండన్‌లో  విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగొచ్చింది శ్ర‌ద్ధ‌. 2021లో సివిల్‌ సర్వీసెస్‌లో త‌న‌కున్న ఆశ‌కు సీఎస్‌ఈకు ప్రిపేర్‌ అయింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అయితే, ఇంటర్నెట్‌ ద్వారా స్టడీ మెటీరియల్‌ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత (60) సాధించడంతో అద్భుతమైన విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. 

అంద‌రికీ స్పూర్తిగా..

త‌న ఆశ‌ల‌ను త‌న కృషి, ప‌ట్టుద‌ల‌, ఆత్మ విశ్వాసంతో త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారం, ప్రాత్సాహంతో అనుకున్న ప్ర‌తీ ల‌క్ష్యాన్ని చేరుకుంది. నేడు ప్ర‌తీ యువ‌తకు శ్ర‌ద్ధ ఒక స్పూర్తిదాయ‌కంగా నిలిచి, త‌న త‌ల్లిదండ్రుల‌ను ఎంతో గ‌ర్వ‌ప‌డే స్థానంలో నిల‌బెట్టింది.

శ్ర‌ద్ధాలో ఉన్న మ‌రో ప్ర‌తిభ‌.. త‌ను ఒక మంచి ఆర్టిస్ట్‌ కూడా.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 10:09AM

Photo Stories