Skip to main content

Govt Jobs Achiever : ఒక గృహిణిగా.. ఏడాది కాలంలోనే ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు స‌ర్కారు ఉద్యోగాలు..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగ సాధన కత్తిమీద సాము లాంటిదే. కానీ పట్టుదలకు శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని పలువురు నిరూపిస్తున్నారు.
Government jobs achiever success story of house wife

సాక్షి ఎడ్యుకేష‌న్: మొయినాబాద్‌ మండలం చిలుకూరుకు చెందిన గడ్డం సౌమ్యారెడ్డి ఏడాది కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్‌ అనిపించుకుంది. గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్‌తో పాటు గత బుధవారం విడుదలైన ఫలితాల్లో గెజిటెడ్‌ హోదా కలిగిన ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికైంది.

Jobs at GIC : జీఐసీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెల రూ.85,000 జీతంతో పాటు.. ఇంకా..

2014లో వివాహం జరిగిన అనంతరం భర్త శ్రీధర్‌రెడ్డితో కలిసి చిలుకూరులో ఉంటూ డిగ్రీ, పీజీ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసింది. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల పోషణను చూసుకుంటూనే పట్టుదలగా చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 10:10AM

Photo Stories