Skip to main content

World Chess Championship Gukesh Dommaraju : 18 ఏళ్ల‌కే.. వ‌ర‌ల్డ్‌ చెస్ ఛాంపియ‌న్‌గా గుకేష్ దొమ్మ‌రాజు.. అత‌ని స్ఫూర్తిదాయ‌క‌మైన క‌థ ఇదే..

ప్ర‌పంచంలోనే అతిపిన్న చెస్స్ ఛాంపియ‌న్‌షిప్‌గా నిలిచాడు గుకేష్ డొమ్మ‌రాజు.
World youngest chess championship gukesh dommaraju success at 18 years

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌పంచంలోనే అతిపిన్న చెస్స్ ఛాంపియ‌న్‌షిప్‌గా నిలిచాడు గుకేష్ డొమ్మ‌రాజు. భారత గ్రాండ్‌మాస్టర్ 14-గేమ్‌ల మారథాన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లోరెమ్‌ను ఓడించి ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్‌షిఫ్‌గా పేరు పొందాడు. దీంతో, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గౌరవనీయమైన కిరీటాన్ని గెలుచుకున్న రెండవ భారతీయునిగా నిలిచాడు గుకేష్‌. త‌న‌కు ఏడు (7) ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు చెస్ ఛాంపియ‌న్‌గా నిలవాల‌నే ఆశ‌యం ఏర్ప‌డింది. దీని కోసం శ్ర‌మించి, ఒక్కొమెట్టు ఎక్కిన గుకేష్ 18 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే ఛాంపియ‌న్‌షిప్‌గా పేరొందాడు.

Tohfa Handicrafts : ఉద్యోగం పోయింది.. చేతి విద్య‌తోనే సొంత వ్యాపారం.. ఉపాధి అవ‌కాశాలతో..

ఉద్యోగాన్ని వీడి..

చెస్ ఛాంపియ‌న్ గుకేష్ తండ్రి ర‌జినీకాంత్‌.. ఒక ఈఎన్‌టీ స‌ర్జియ‌న్‌. త‌ల్లి ప‌ద్మ.. మైక్రోబయాలజిస్ట్. త‌న తండ్రి గుకేష్‌తో క‌లిసి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తీ పోటీల‌కు గుకేష్‌తో వేళ్లాల్సిన స‌మ‌యంలో త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌, గౌర‌వ‌ప‌ర‌మైన వృత్తిని వీడాల్సి వ‌చ్చింది. ఇంటిని చూసుకునేందుకు త‌ల్లి కూడా త‌న ఉద్యోగాన్ని వ‌దిలి ఇంటి బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. దీంతో, తల్లి ప‌ద్మ‌.. ఇంటి ఖర్చులను చూసుకుంటూ, ప్రాథమిక పోషకురాలిగా మారింది. ఇలా, ప్ర‌తీ ఒక్క‌రు ఒక్కో విధంగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

త‌ల్లిదండ్రుల క‌ష్టం, త్యాగం..

ఈ ప్ర‌యాణంలో మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. ఆ స‌మ‌యంలో నాకు తెలియ‌లేదు. 2017, 2018 స‌మ‌యంలో ఎంతో ఆర్థిక ఇబ్బందుల‌కు లోన‌య్యాము. ఆ స‌మ‌యంలో మా త‌ల్లిదండ్రుల స్నేహితులు స‌హ‌కరించారు. ఎన్నో క‌ష్టాలు ప‌డుతూ, ఈ ప్ర‌యాణంలో చాలానే త్యాగాలు చేశారు. నాకోసం, నేను టౌర్న‌మెంట్లు ఆడేందుకు ఆ స‌మ‌యంలో వారు వారి జీవ‌న‌సైలిని సైతం మార్చాల్సి వ‌చ్చింది. అని త‌న క‌ష్ట‌మైన ప్ర‌యాణాన్ని పంచుకున్నారు గుకేష్‌.

Govt Jobs Achiever : ఒక గృహిణిగా.. ఏడాది కాలంలోనే ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు స‌ర్కారు ఉద్యోగాలు..

చెస్ ప్ర‌యాణం..

2013లో విశ్వనాథన్ ఆనంద్ తన ప్రపంచ టైటిల్‌ను నార్వేజియన్ మావెరిక్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో కోల్పోయిన సంవత్సరంలో.. ఒక గంట, వారానికి మూడుసార్లు పాఠాలతో గుకేశ్ చెస్ ప్రయాణం ప్రారంభమైంది. త‌న‌కు 7 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే చెస్ ఛాంపియ‌న్ అవ్వాల‌నే క‌ల ఏర్పడింది.

Women Success Story : క్లాట్ ర్యాంక‌ర్‌గా 13 ప‌త‌కాలు.. తొలి ప్ర‌యాత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు.. మ‌రో టాలెంట్ ఇదే..

కాని, 18 ఏళ్ల‌కే సాకారం అవుతుంద‌నుకోలేద‌ని తెలిపారు గుకేష్‌. ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్ విజేతగా అనేక సార్లు పేరొందిన గుకేష్‌, 2017లో ఫ్రాన్స్‌లోని కేన్స్ లో నిర్వ‌హించిన టౌర్న‌మెంట్‌లో నెగ్గి, అంత‌ర్జాతీయ చెస్ మాస్ట‌ర్‌గా నిలిచాడు. 64-చదరపు చదరంగం బోర్డు పట్ల గుకేష్‌కు ఉన్న మక్కువతో అతనిని 4వ‌ తరగతి తర్వాత పాఠశాలకు  హాజరుకాకుండా ఆపడానికి అతని తల్లిదండ్రులను ప్రేరేపించింది. 

2019లో న్యూఢిల్లీలో జరిగిన టోర్నమెంట్‌లో గుకేశ్ చరిత్రలో రెండో అతి పిన్న వ‌య‌సులోనే గ్రాండ్‌మాస్టర్‌గా  నిలిచిన రికార్డు ఉంది. ఈ రికార్డును రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ అధిగమించాడు కానీ, తరువాత యూఎస్ఏ  నుండి వచ్చిన భారతీయ-అమెరికన్ అత్యంత ప్ర‌తిభ క‌లిగిన అభిమన్యు మిశ్రా ఈ రికార్డును బ‌ద్దలు కొట్టాడు. ఇలా, ఒక‌టి త‌రువాత ఒక‌టి అంటూ మెట్లు ఎక్కుతూ వెళ్లాడు గుకేష్‌.

Shraddha Gome's Success Journey:CLATలలో అగ్రస్థానంలో నిలిచి,13 బంగారు పతకాలు సాధించి.... తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ : శ్రద్ధా గోమె సక్సెస్‌ జర్నీ

విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌నే స్పూర్తిగా..

ఇలా, త‌న ప్ర‌తిభ‌తో ఒక్కొక్క‌రిని ఓడిస్తూ, ప్ర‌తీ గెలుపును త‌న ఖాతాలో వేసుకుంటున్న గుకేష్ ఒకానొక సంద‌ర్భంగా స్పాన్స‌ర్స్ లేని స‌మయంలో త‌న ప్రైజ్ మ‌నీ, త‌న తల్లిదండ్రు దాచుకున్న డ‌బ్బులు, అన్నింటినీ కూడ క‌ట్టేవారు.

Young Women Success Story : ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థ‌లో ఉద్యోగాల‌ను వ‌దులుకుంది.. ఈ ల‌క్ష్యం కోస‌మే పోరాడి.. చివ‌రికి..!

ఇలా, అనేక సవాళ్లను ఎదుర్కుంటున్న‌ప్ప‌టికీ, అతను తన ఆరాధ్యదైవమైన ఆనంద్‌ను గత సంవత్సరం భారతదేశం నం.1గా అధిగమించాడు. తిరిగి, 2020లో కోవిడ్-19 మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో వెస్ట్‌బ్రిడ్జ్-ఆనంద్ చెస్ అకాడమీలో ఆనంద్‌ను మెరుగుపరిచేందుకు వెళ్లడం విధి స్ట్రోక్, ఇది చాలా క్రీడా కార్యకలాపాలను నిలిపివేసింది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Dec 2024 12:42PM

Photo Stories