Skip to main content

School Teachers : వివ‌రాలే కాదు.. ఇక‌ నుంచి ఫోటోలు కూడా త‌ప్పనిస‌రి.. విద్యాశాఖ ఆదేశం!

ఇక‌పై ప్ర‌తీ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల ఫోటో త‌ప్ప‌నిసరి అని పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశించింది.
Teachers photos and details in schools and colleges

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు బోధ‌న అందించ‌డం ఉపాధ్యాయుల ప‌ని. కాని వారు ఎవ్వ‌రికీ తెలీకుండా వారికి బ‌దులుగా మ‌రొకరిని పంపుతూ వారి క్లాసుల‌ను మ‌రో వాలెంటీర్‌చే చెప్పిస్తున్నారు కొంద‌రు ఉపాధ్యాయులు. కొంద‌రు ఉపాధ్యాయులు పాఠ‌శాల‌ల‌కు వ‌స్తున్న‌ట్లు సందేశం ఇచ్చి వారికి బ‌దులు వాలెంటీర్ల‌ను విద్యార్థుల‌కు బోధ‌న అందించేందుకు పంపుప‌తున్నారు.

Anganwadi Workers : పెంచ‌ని జీతాలు.. భ‌ర్తీకాని పోస్టులు.. ఆందోళ‌న‌బాట‌లో అంగ‌న్వాడీలు..!

మ‌రికొంద‌రు ఉపాధ్యాయులు తరుచూ పాఠశాలకు రాకుండా డుమ్మాలు కొడుతున్నారు. దీనికి గ‌మ‌నించిన అధికారులు ఇక‌పై ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండేలా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మెర‌కు విద్యాశాఖ ఒక నిర్ణ‌యం తీసుకొని అందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. 

ప్ర‌తీ పాఠ‌శాల‌లో ఫోటోలు త‌ప్ప‌నిస‌రి..

ఉపాధ్యాయులు విద్యార్థుల‌కు బోధ‌న అందించ‌డం త‌ప్ప అన్ని చేస్తున్నార‌ని పాఠ‌శాల‌ విద్యా శాఖ అధికారులు ప్ర‌తీ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని ఆదేశించింది. ఇలా, చేస్తే ఉపాధ్యాయుల‌ను గ్రామ‌స్తులు కూడా గుర్తుప‌ట్ట‌గ‌ల‌ర‌ని వివ‌రించింది విద్యాశాఖ‌. అసలు ఉపాధ్యాయులు ఎవరో గ్రామస్తులకు తెలియకపోవడంతో గతంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకే, ఇక నుంచి అలాంటి జరగటానికి ఏ మాత్రం అవకాశం లేకుండా ఉండేలా, ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుందని వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ వివ‌రాల‌తో పాటే..

విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలల్లో ఆగమేఘాల మీద ఉపాధ్యాయుల ఫొటోలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో కేవలం ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉండేవి. కానీ ఇక నుంచి వివరాల పక్కనే వారి ఫొటోలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అన్ని పాఠశాల‌ల్లో..

గ‌తంలో జ‌రిగిన విధంగా మ‌రోసారి జ‌రిగిన కార‌ణంగా, విద్యార్థులకు వారి చ‌దువుకు ఏమాత్రం ఇబ్బందులు ఎదురు కావొద్ద‌ని, తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల, కేజీబీవీలు, గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే ప్రాంతాల్లో ఉంచనున్నారు.

Physical Tests For AP Constables: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెలలోనే ఫిజికల్‌ టెస్టులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చాం. ఇక నుంచి ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల ఫొటోలతోపాటు వారి వివరాలను ప్రదర్శిస్తాం.

- అశోక్‌, డీఈఓ, సూర్యాపేట

☛➤ ప్రాథమిక పాఠశాలలు 680

☛➤ ప్రాథమికోన్నత 78

☛➤ జెడ్పీ ఉన్నత 182

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

☛➤ ఆదర్శ స్కూళ్లు 09

☛➤ కేజీబీవీలు 18

☛➤ ప్రతి స్కూల్‌లో టీచర్ల ఫొటోలు

Published date : 13 Dec 2024 01:46PM

Photo Stories