Skip to main content

Inspirational Story : మాది సంచార జాతి.. చిత్తు కాగితాలు ఏరి, భిక్షాటన చేసి చ‌దివి.. నేడు డీఎస్సీ ఉద్యోగం కొట్టానిలా... కానీ..

మాది సంచార జాతి కుటుంబం. తిన‌డానికి తిండి లేదు. ఉండ‌టానికి ఇల్లు లేదు. ప్ర‌తిరోజు ఒక పూట అన్నం కోసం ఆక‌లి పోరాటం చేయాల్సిందే. ఉద‌యాన్నే నిద్రలేవగానే... వీధి వీధి తిరిగి చిత్తు కాగితాలు ఏరి.., ఈ ప‌ని అయ్యాక స్కూల్‌కి వెళ్లి చ‌దువుకోవాలి.
poor family police officer gangadhar acp inspirational success story

అలాగే భిక్షాట‌న కూడా చేస్తుండే వాడిని. ఇలా క‌ఠిన‌ పేద‌రికం అనుభ‌వించిన కూడా... ఏనాడు చ‌దువును నిర్లక్ష్యం చేయ‌లేదు. చ‌దువునే త‌న సొంత ఆస్తిగా భావించిన నేడు అంద‌రు ఆశ్చ‌ర్య‌పయేలా... DSP స్థాయికి ఎదిగాడు మందనం గంగాధర్‌. ఈ నేప‌థ్యంలో మందనం గంగాధర్ స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
నేను తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు వాసిని. ఆర్థికంగానే కాదు... కుటుంబ‌ ప‌రంగా.., సామాజికంగానూ చిదిమ వేసిన సంచార జాతికి చెందిన వారిమి మేము.

ఎడ్యుకేష‌న్ :
త‌న తోటి పిల్ల‌లు మంచి మంచి డ్రెస్ వేసుకోని.. కేరింత‌లు కొడుతూ.. స్కూల్స్‌కి వెళ్లుతుంటే... నేను కూడా ఇలా చ‌దువుకుంటే ఎంత బాగుండో అని అలా చూస్తుండే వాడిని. క్ష‌ణం గ‌డ‌వ‌క ముందే.. ఇక 'రేయ్ రారా' అనే నాన్న గ‌ట్టిగా పిలువు. నాన్న జోలేప‌ట్టి ఇంటింటికి వెళుతున్నాడు. కొడుకు వెన‌క‌ప‌డేప్ప‌టికి గ‌ట్టిగా కేక‌వేశాడు. దీంతో బ‌డి ఆలోచ‌న బంద్‌.అయితే ఇది తాత్కాలిక‌మే అనుకోండి. కానీ ఈ కుర్రాడు ఎలాగైన చ‌ద‌వాల‌ని బలంగా నిర్ణ‌యించుకున్నాడు. 

☛➤ Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

చ‌దువుకుంటాన‌య్యా అని చెప్ప‌లేని పరిస్థితి...

acp gangadhar

5 మంది అన్న‌ద‌మ్ముల్లో త‌నే పెద్ద‌వాడు కావ‌డంతో తండ్రికి అన్నింట తోడు ఉండే వాడు. మ‌న‌స్సులో బ‌ల‌మైన కోరిక ఉన్నా.. చ‌దువుకుంటాన‌య్యా అని చెప్ప‌లేని పరిస్థితి... కార‌ణంగా త‌న‌లో త‌నే బాధ‌ప‌డ్డాడు. ఓ రోజు ఒక ఆలోచ‌న వ‌చ్చింది. మ‌న‌వాళ్ల‌లో కొంద‌రు చిత్తుకాగితాలు వేరుతూ.. డ‌బ్బులు సంపాదిస్తున్నారు. నేను కూడా ఇలా చిత్తుకాగితాలు వేరి.. కొంత డ‌బ్బులు సంపాదిస్తే.. కుటుంబ భారంగా కాకుండా ఉంటుంద‌నుకున్నాడు. అప్పుడు నేను కూడా బాగా చ‌దువుకోవ‌చ్చు అనుకున్నాడు. ఈ విష‌యం ఇంట్లో చెప్పాడు.. వాళ్లు స‌రే అన‌డంతో.. ఇక గంగాధర్ ఆనందంకు ఆవ‌ధులు లేవ్‌. ఆ వెంట‌నే స్కూల్స్‌లో జాయిన్ అయ్యాడు. 

➤☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

నిద్ర లేవ‌గానే వీధి వీధి తిరుగుతూ..
ఉద‌యం నిద్ర లేవ‌గానే వీధి వీధి తిరుగుతూ.. కాగితాలు వేర‌డం.. ఆ ప‌ని అయ్యాక స్కూల్ వెళ్లి చ‌దువుకునే వాడు. ఇలా క‌ష్ట‌ప‌డుతూ చ‌దివి.. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివాడు. ప‌ది పాస్ అయ్యాక‌... ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. 

పేప‌ర్ వేస్తూ.. వీధి వీధి తిరుగుతూ పండ్లు, ఐస్ అమ్ముతూ..
ఇంట‌ర్‌లో జాయిన్ అవ్వాలంటే.. ఫీజులు, బుక్స్‌కు డ‌బ్బులు లేవ్‌. అయినా ఎలాంటి వెన‌క‌డుగు వేయ‌కుండా.. ఇంట‌ర్‌లో జాయిన్ అయి... పేప‌ర్ బాయ్‌గా జాయిన్ అయి.. డైలీ ఉద‌యం ఇంటింటికి తిరిగి పేప‌ర్ వేసేవాడు. అయినా కూడా వ‌చ్చిన డ‌బ్బులు స‌రిపోకపోవ‌డంతో... వీధి వీధి తిరుగుతూ పండ్లు, ఐస్ అమ్ముతూ.. వ‌చ్చిన డ‌బ్బుతో చ‌దువును కొన‌సాగించే వారు. 

➤☛ IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

ఎన్నో అవ‌మానాలు, హేళ‌న‌లు ఇలా..
ఈ ప‌నులు చేస్తున్న‌ప్పుడు అవ‌మానాలు, హేళ‌న‌లు ఎదుర్కొవాల్సి వ‌చ్చింది. ఇలా అవ‌మానాలు జ‌రుగుతున్నా ఎలాంటి ద‌శ‌లో కూడా... కుంగిపోలేదు. క‌ష్ట‌ప‌డి సంపాదించి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో చ‌ద‌వ‌డంతో ఉన్న ఆనందం వారికి తెలియ‌దు అనుకునేవాడు. ఇలా చ‌దివి ఇంట‌ర్ కూడా పూర్తి చేశాడు. అలాగే డిగ్రీ కూడా పూర్తి చేశాడు.

ఈ స‌మ‌యంలోనే నాకు..

ACP Gangadhar Real Life Story

డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ... ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)లో చేసి.. ఆ త‌ర్వాత MPhil మొద‌లు పెట్టాడు. ఈ స‌మ‌యంలోనే ఎస్ఐ ఉద్యోగంకు ప్రిపేర్ అయి... తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ ఉద్యోగంకు సెలెక్టయ్యారు. ఇలా 1998 బ్యాచ్‌లో ఎస్‌ఐగా చేరారు గంగాధర్. ఇలా మొద‌టి అడుగు స‌క్సెస్ అయ్యాడు.

ఇక తిరుగు లేకుండా..
మందనం గంగాధర్.. నల్గొండ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. అలాగే 2010లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయనకు పదోన్నతి లభించింది. ఎవరి పట్ల నిస్పక్షపాతంగా వ్యవహరించ లేదు. అదే విధంగా ఎవరిని అణిచివేసే ప్రయత్నం చేయలేదు. తమకు జరిగిన అన్యాయంతో పోలీస్ స్టేషన్‌ మెట్లేక్కిన ఏ ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చూశారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ... డీఎస్సీ వ‌రకు చేరాడు.

➤☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

వ‌చ్చిన అవార్డులు ఇవే..

dsp mandha gangadha success story in telugu

ఇప్పటి వరకు దాదాపు 200 రివార్డులను సైతం గంగాధర్ అందుకున్నారు. అలాగే నల్గొండలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని భావించి.. వాటిని ఆదిలో నియంత్రించగలిగాను. దీంతో ఉన్నతాధికారుల ప్రశంసలకు సైతం ఆయన పాత్రుడయ్యారు. పోలీస్ శాఖలో చేరిన కొన్ని సంవత్సరాలకే.. కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను ఆయనను వరించాయి. 

ఈ గ్రామస్తులు చికున్ గున్యా బారిన పడిన సమయంలో..
ఓ పోలీస్ అధికారిగా నేరాలు నియంత్రించడంతోపాటు ప్రజలను జాగృతి చేయడంతో ఆయన నూటికి నూరు శాతం సఫలీకృతుడయ్యారు. ఇక సంస్థాన్ నారాయణ్‌పూర్‌ గ్రామస్తులు చికున్ గున్యా బారిన పడిన సమయంలో.. మెడికల్ క్యాంపులు నిర్వహించి.. వారికి అందించిన సేవలను వారు నేటికి మరువ లేక పోవడం గమనార్హం.

యువ‌త చెడు మార్గంలో పయనించకుండా.. 

ACP Gangadhar Exclusive interview

అలాగే వివిధ స్థాయిల్లో పరీక్షలు తప్పిన యువత.. చెడు మార్గంలో పయనించకుండా.. వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అదే విధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో పలు కేసులను చాలా చాకచక్యంగా ఆయన పరిష్కరించారు. 

➤☛ Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

టీఎస్సీపీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్‌ దర్యాప్తుతో..
అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీక్‌ దర్యాప్తుతోపాటు దేశ భద్రతకు సంబంధించిన అతి పెద్ద కేసుల విచారణలో సైతం గంగాధర్ పాల్గొన్నారు. అయితే దశాబ్దాల సర్వీసులో ఇప్పటి వరకు ఆయన ఒక్క మెమో కూడా తీసుకోకపోవడం గమనార్హం.

➤☛ Government Jobs Ranker Success Story : ఇలా చ‌దివి.. 5 గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్ కొట్టానిలా.. కానీ నేను మాత్రం..!

నేటి యువ‌త‌కు గంగాధర్ డీఎస్సీ జీవితం ఒక స్ఫూర్తిదాయ‌కం..

ACP Gangadhar Real Life News in Telugu

గంగాధర్‌కు.. ఒకప్పుడు తిన‌డానికి తిండి లేదు.. ఉండ‌డానికి ఇళ్లు లేదు.. చ‌దువుకోవ‌డానికి డ‌బ్బులు లేవు. వీధి వీధి తిరిగి  చిత్తు కాగితాలు ఏరి.. భిక్షాటన చేసి చ‌దివాడు. నేడు అంద‌రు గ‌ర్వించేలా ఉన్న‌త స్థాయిలో ఉన్నాడు. కానీ పోరాడితే సాధించ‌లేనిది ఏది లేదు నిరూపించాడు గంగాధర్‌. నేటి యువ‌త‌కు గంగాధర్ డీఎస్సీ జీవితం ఒక స్ఫూర్తిదాయ‌కం.

Published date : 15 Dec 2024 12:31PM

Photo Stories