Skip to main content

Contract and Outsourcing Employees Salary : కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. వీరి జీతాలు పెంపుపై...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే.. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు వేతనాలు అందే చ‌ర్య‌లు తీసుకోవాలి మంత్రి ఆదేశించారు.
Contract and Outsourcing Employees Salary  Minister Sitakka announcement for contract employees in Telangana  Good news for contract and outsourcing employees in Telangana  Minister Sitakka orders fixed salary date for contract workers  Telangana Minister Sitakka ensures monthly salary date for contract employees

అలాగే పంచాయతీ రాజ్‌, గ్రామీణ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి నెల‌ రెగ్యులర్‌ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ శాఖల్లోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను మంత్రి సూచించారు.

➤☛ APSRTC Jobs Notification 2024 : ఎలాంటి రాత ప‌రీక్షలేకుండానే... APSRTCలో ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే...

ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా..
ఆన్‌లైన్‌లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్టు సమాచారం. పంజాయతీ రాజ్‌, గ్రామీణ శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని మంత్రి సూచించారు. వారికి నెలనెలా జీతాలు అందేలా నూతన విధానం తీసుకురావాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అలాగే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచే అవ‌కాశం కూడా ఉంది.

➤☛ TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భ‌ర్తీ చేస్తాం ఇలా..!

Published date : 06 Nov 2024 03:55PM

Tags

Photo Stories