Skip to main content

Government Jobs Success Tips : ఇలా రివిజన్ చేయ‌డంతోనే... ఒకే సారి మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. కానీ..

ప్ర‌స్తుత ఉన్న పోటీరంగంలో ఏదో ఒక ఉద్యోగం వ‌స్తే చాలు అని ఎంతో మంది యువ‌త అనుకుంటారు. అది ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌స్తే... వీరి ఆనందంకు అవ‌ధులు ఉండ‌వ్‌... ఇక లైఫ్ సెట్ అయిన‌ట్టే భావిస్తారు. కానీ యువ‌తి మాత్రం... ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా కేవలం ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించి.. ఔరా అనేలా చేసింది. ఈమే రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతంకు చెందిన కల్పన. ఈ నేప‌థ్యంలో ఈ స‌క్సెస్ స్టోరీ మీకోసం...
SI Kalpana Success Story

పేదరికం, ఆర్థిక సమస్యలను సైతం లెక్కచేయకుండా..
ఏదైన ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది చాలా మందికి ఉండే కల. దానిని నిరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడి చదువుతుంటారు. కొందరు అయితే పేదరికం, ఆర్థిక సమస్యలను సైతం లెక్కచేయకుండా తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విజయం సాధిస్తారు. మరికొందరు మాత్రం విజయం కోసం కృషి చేస్తుంటారు. అయితే ఏళ్ల తరబడి కష్టపడితేనే ఎక్కువగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం లేదు..

తల్లితో పాటు పొలం పనులు చేస్తూ...
రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది యువతులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అయితే వారందరికి భిన్నంగా 'కల్పన' అనే యువతి అద్భుతం చేసింది. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన  అందరికి ఆదర్శంగా నిలిచారు. కల్పన తల్లి పొలం పనులలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది కల్పన తండ్రి మహిపాల్ కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని డబ్బులు పంపిస్తుండే వారు. ఇక కుటుంబ  ఆర్థిక పరిస్థితిని చూసిన కల్పన ఎలాగైనా మార్చాలని భావించింది. మంచి ఉద్యోగం సాధించాలని కల్పన అనుకుంది. 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

చదివే టైమ్‌లోనే..
కల్పన రాజస్థాన్ లోని బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే కాలేజీ రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యింది. తన తల్లికి పొలం పనులతో పాటు ఇంటి పనులకు కూడా చేస్తుంది. ఇదే సమయంలో తాను ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిప‌రేష‌న్ కొన‌సాగించింది.

క‌ల్పన తల్లి అయితే...
ఎట్ట‌కేల‌కు కల్పన ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంకు ఎంపికైంది. దీంతో ఆమె ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కల్పన తల్లి అయితే ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇన్ స్పెక్టర్ జాబ్ కంటే ముందు ఆమె తొలుత సీహెచ్‌ఎస్‌ఎల్‌లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. అనంతరం ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. తాజాగా సీజీఎస్‌టీలో ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం చేజిక్కించుకుంది. అయితే ఈ మూడు ఉద్యోగాలను కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సాధించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఇలా రివిజన్‌తోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించా...
తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని తెలిపింది. ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది.  ప్రిపేర్  కావడంతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని కల్పన తెలిపింది. ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని పేర్కొంది.

Published date : 25 Sep 2024 09:27AM

Photo Stories