Skip to main content

IAS Abhilasha Sharma Success Story : తొలి మూడు ప్ర‌య‌త్నాలు విఫ‌లం.. ఆశ‌లు వ‌దులుకున్న‌... వీరి ప్రోత్సహంతోనే నేడు ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యా.. కానీ..!

అనుకున్న సాధించాలని ప‌ట్టుద‌ల ఉంటే ఎన్ని అండంకులు వ‌చ్చినా, ఎన్ని విఫ‌లాలు వ‌చ్చిన సాధ్యం అవుతుంది. మ‌నం చేసే ప్ర‌య‌త్నాలే, అందుకు నిద‌ర్శ‌నం.
Inspiring and successful story of upsc ranker and ias officer abhilasha sharma

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ల‌క్ష్యాలు ఎంత పెద్ద‌దైనా చేరాల‌న్న సంకల్పం ఉంటే ఎంత దూర‌మైనా ప్ర‌య‌ణించ‌వ‌చ్చు. చిన్న ప‌రీక్ష ద‌గ్గ‌రి నుంచి ఐపీఎస్‌, ఐఏఎస్ వంటి పోటీ ప‌రీక్ష‌ల వ‌ర‌కు ప్ర‌తీ మెట్టులో గెలుపు ద‌క్కించుకోవ‌చ్చు. ఇటువంటి ఒక క‌థే ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌ది కూడా.

IAS Jaya Ganesh Success Story : ఒక‌ప్పుడు వెయిట‌ర్‌గా.. యూపీఎస్సీలో 6 ప్ర‌య‌త్నాలు విఫ‌లం.. ఇది కూడా వ‌ద్ద‌నుకొని.. చివ‌రికి!

త‌న కృషి, సంక‌ల్పం, ప‌ట్టుద‌లతో అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకొని అంద‌రికీ.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుచుంది. త‌నే 2017లో యూపీఎస్సీ ర్యాంక‌ర్‌తో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా మారిన‌ అభిలాష శ‌ర్మ. ఇప్పుడు మ‌నం తెలుసుకోనున్న విజ‌య‌గాథ ఈ ఐఏఎస్ ఆఫీస‌ర్‌దే..

Success

హ‌ర్యానాలో పుట్టి పెరిగిన యువ‌తి అభిలాష‌. చిన్న‌త‌నంలో ప్ర‌తీ ఒక్క‌రికి ఒక‌ ఆశ ఉంటుంది. ప్ర‌తీ ఒక్క‌రు క‌ల‌లు కంటారు కాని, కొంద‌రివి మాత్ర‌మే నిజం అవుతాయి. అయితే, ఆ క‌ల‌ల‌ను నిజం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేయాలే కాని, ప్ర‌తీ క‌ల ఏదో ఒక రోజు నిజంగా మారుతుంది. ఈ మాట‌ల‌ను నిజం అని నిరూపించారు అభిలాష శ‌ర్మ‌.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

మొద‌ట్లోనే విఫ‌లం..

ఎన్నో ఆశ‌లు, క‌ల‌ల‌తో చ‌దువుకున్న అభిలాష చివ‌రికి 2013లో త‌న క‌ల‌ల‌కు దీటుగా అడుగులు వేయ‌డం ప్రారంభించింది. ఈ సంవ‌త్స‌రం నుంచే యూపీఎస్సీ ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టి మూడు ప్ర‌య‌త్నాలు చేసింది. కాని, అన్ని విఫ‌లం అయ్యాయి. ప్ర‌తీ అడుగులో అయితే, మెయిన్స్‌లో లేదా ఇంట‌ర్వ్యూలో త‌ప్పేది. మొద‌ట్లోనే విఫ‌లాలు ఎదుర‌య్యాయి అని చాలా కృంగిపోయేద‌ట‌. ప్ర‌తీ అడుగులో ఎంత ఎక్కువ నేర్చుకున్నా కూడా ఏదో ఒక చోట త‌ప్పేది.

AP TET 2024 Ranker Success Story : జస్ట్‌మిస్‌... ఏపీ టెట్‌లో 149.99/150 కొట్టానిలా.. కానీ..

ప్ర‌య‌త్నాలు వీడి..

తాను చేసిన మూడు ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఇక త‌న ఆశ‌ల‌ను, న‌మ్మకాన్ని వ‌దులుకుంది. ఈ ప్ర‌య‌త్నాలు వ‌ద్ద‌నుకొని, ఆశ‌ల‌ను కూడా కోల్పోయింది. 2017లో తాను ప్రేమించిన అంకిత్.. ఒక వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకుంది.

Success

నాలుగో ప్ర‌య‌త్నంగా

ఈ కొత్త జీవితంలో అడుగు పెట్టిన త‌రువాత త‌న భ‌ర్త‌, కుటుంబం ఇచ్చిన తోడు, ప్రోత్సాహం అంత ఇంత కాదు. త‌ను ఐఏఎస్ ఆపీస‌ర్ అవ్వాల‌ని ఆశించిన అభిలాషకు త‌న అత్తారింటి స‌భ్యులంద‌రూ తోడుగా నిలిచారు. ప్ర‌తీ ఒక్క‌రి ప్రోత్సాహం ద‌క్కింది. దీంతో తాను తిరిగి నాలుగో ప్ర‌య‌త్నంగా యూపీఎస్సీ ప‌రీక్ష‌కు ప్రిపేర్ కావ‌డం ప్రారంభించింది.

Success Story : తీవ్రమైన పోటీని తట్టుకొని.. ఒకే సారి నాలుగు గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌లు కొట్టానిలా... కానీ..!

రోజుకు క‌నీసం 15 నుంచి 18 గంటల పాటు..

ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ అభిలాష త‌న ప్రిప‌రేష‌న్ స్ట్రాటజీని పంచుకున్నారు. అయితే, త‌న‌కు త‌మ అత్తమామ‌, త‌న భ‌ర్త ప్రోత్సాహం ద‌క్కిన త‌రువాతే ఈ ప్ర‌యత్నం మొద‌లు పెట్టాన‌ని చెప్పుకోచ్చారు. మూడో ప్ర‌య‌త్నంలో భాగంగా త‌న ప్రిప‌రేషన్ స్ట్రాట‌జీని పంచుకున్నారు.

Success

తాను రోజుకు 15 నుంచి 16 గంట‌ల పాటు చదివేవార‌ని, కరెంట్ అఫైర్స్‌తో అప్‌డేట్‌గా ఉండేందుకు రోజు ఒక‌పూట ఖ‌చ్చితంగా వార్త ప‌త్రిక చ‌దివ‌డానికి కేటాయించేవార‌ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, పోలిటిక‌ల్ సైన్స్‌, ఇంట‌ర్నేష‌నల్ రిలేష‌న్స్ వంటి స‌బ్జెక్టుల్లో విజ్ఞానం పెంచుకునేందుకు మ‌రింత స‌మ‌యాన్ని కేటాయించేవార‌ని తెలిపారు. దీంతోపాటు ఈ ప‌రీక్ష‌ల్లో ఆప్టెట్యూడ్‌పై కూడా దృష్టి సారించాల‌ని తెలుపుతూనే ఇత‌రుల‌కు సూచించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ప్రోత్సాహంతోనే సాధ్యం

తాను గెలిచిన ఈ విజ‌యాన్ని త‌న భ‌ర్త‌కు అంకితం చేస్తున్నాన‌ని తెలిపారు అభిలాష‌. త‌న ఆశ‌ల‌ను వ‌దులుకున్న స‌మ‌యంలో పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ త‌న జీవితాశ‌యాన్ని అర్థం చేసుకొని అటు అత్త మామతోపాటు త‌ల్లిదండ్రులు, ఇటు భ‌ర్త తోడు కూడా ఉండ‌డంతో మ‌రింత సులువైందని ఆనంద‌ప‌డ్డారు. 
జీవితంలో ఏదైనా అనుకున్న వెంటనే రాద‌ని, దేనినైనా క‌ష్ట‌ప‌డి, ప‌ట్టుద‌ల‌తోనే సాధ్యం చేసుకోవాల‌ని నిరూపించారు ఐఏఎస్ అభిలాష శ‌ర్మ‌.

Husband and Wife Success Story : పేదరికంను అనుభ‌వించాం.. ఒకేసారి నేను.. నా భార్య గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌లు కొట్టామిలా.. కానీ...

Published date : 11 Nov 2024 08:55AM

Photo Stories