15 Holidays for Schools and Colleges : స్కూల్స్, కాలేజీలకు 15 రోజులు సెలవులు.. ఎందుకంటే..!
సాక్షి ఎడ్యుకేషన్: ప్రతీసారిలా ఒకటి రెండు రోజుల ఆనందం కాకుండా, ఈసారి చాలారోజులు విద్యసంస్థలకు సెలవు రానుంది. ఎందుకంటే, ఈసారి విద్యసంస్థలకు ఏకంగా, 15 రోజుల సెలవులు ఉంటాయన్నారు.
అనేక రాష్ట్రాల్లో రోజురోజుకి చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొందరు విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే, విద్యాసంస్థలకు శీతాకాలం సెలవులను ప్రకటించనుంది ప్రభుత్వం. శీతాకాలం సందర్భంగా రోజురోజుకూ ఊష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి.. దీంతో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కో రాష్ట్రంలో 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు, ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయంటే.
ఏ రాష్ట్రాల్లో అంటే..!
ఉత్తర్‌ప్రదేశ్‌లో సెలవులు:
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాధారణంగా, ప్రతీ ఏటా డిసెంబర్‌లో చివరి వారం రోజుల్లో ఈ శీతాకాల సెలవులను ప్రకటిస్తూ ఉంటారు అక్కడి ప్రభుత్వం. కాని, ఈసారి ఆ సెలవులను మరికాస్త పొడగిస్తూ.. ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు.
Education News: ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు ....డిసెంబర్‌లో ట్యాబ్‌లు అందక విద్యార్థులు డీలా
పంజాబ్‌లో సెలవులు:
పంజాబ్‌లో రాష్ట్రంలోని స్కూళ్లకు శీతాకాల సెలవుల సంబంధిత నోటిఫికేషన్‌ను అక్కడి విద్యా శాఖ సోమవారం అంటే, డిసెంబర్ 16వ తేదీన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులు.. ఏకంగా ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఢిల్లీలో సెలవులు:
భారత దేశ రాజధాని ఢిల్లీలో అయితే, రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో, అక్కడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటుంన్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
హర్యానాలో సెలవులు:
హర్యానా రాష్ట్రంలో కూడా శీతాకాల సెలవులు ప్రకటించనున్నారు అక్కడి ప్రభుత్వం. అయితే అక్కడి అధికారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. త్వరలోనే శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలి గాలుల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది.
Andhra Pradesh Breaking News: విశాఖ జిల్లాలో వదలని వర్షం ఇవాళ స్కూళ్లకు సెలవు....
జమ్మూ కాశ్మీర్ సెలవులు:
జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యా శాఖ.. కాశ్మీర్ లోయతోపాటు జమ్మూ డివిజన్‌లోని పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని 5వ తరగతి వరకు పాఠశాలలు డిసెంబర్ 10 నుంచి ఇచ్చారు. అంతేకాకుండా 6 నుంచి 12వ తరగతుల వరకు డిసెంబర్ 16 నుంచి పాఠశాలలు మూసివేశారు. అయితే ఈ స్కూళ్లకు శీతాకాల సెలవులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో శీతాకాలంలో నిత్యం మంచు కురుస్తుంది కాబట్టి అక్కడి ప్రభుత్వం.. ఈ సమయంలో ఎక్కువగా స్కూళ్లకు హాలిడేస్ ఇస్తుంది.
Tags
- Schools Holidays News
- Holidays 2024
- December 2024 Holidays
- schools and colleges holidays december 2024
- education institutions holidays december 2024
- christmas and news year holidays for schools and colleges
- delhi schools holidays
- State government
- holidays declaration for schools and colleges
- Jammu and Kashmir
- punjab schools holidays news
- Schools Holidays News in Telugu
- winter vacation for schools latest news in telugu
- winter vacation for education institutions latest updates
- 15 days holidays for schools
- 15 days vacation for school students
- Education News
- Sakshi Education News