Skip to main content

Job Mela : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈనెల 28న‌ జాబ్ మేళా.. ఈ జిల్లాలోనే!

త‌మ చ‌దువుల‌ను పూర్తి చేసుకొని కొంద‌రు విద్యార్థులు, బాధ్య‌త‌ల కారణంగా చ‌దువు మానుకొని ఉద్యోగం కోసం వేచి చూసే యువ‌త మ‌రోవైపు ఉన్నారు.
Job mela for unemployed youth on 28th december  Tribal youth job fair in Utnur  Utnur job fair for tribal youth on December 28 Employment opportunities for tribal youth in Ummadi district

సాక్షి ఎడ్యుకేష‌న్: త‌మ చ‌దువుల‌ను పూర్తి చేసుకొని కొంద‌రు విద్యార్థులు, బాధ్య‌త‌ల కారణంగా చ‌దువు మానుకొని ఉద్యోగం కోసం వేచి చూసే యువ‌త మ‌రోవైపు ఉన్నారు. వారి కోసమే ఈ జాబ్ మేళా. ముఖ్యంగా గిరిజ‌న యువ‌త‌కు ప్ర‌భుత్వం ఈ మేళా నిర్వ‌హించనుంది. ఉమ్మడి జిల్లా ఉట్నూరు పట్టణంలో గిరిజన యువతి యువకుల కోసం ఈ నెలాఖ‌రిలో అంటే, డిసెంబ‌ర్ 28వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

CBSE Schools Breaking News: సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీల్లో దొరికిన డమ్మీ విద్యార్థులు!

అయితే, గిరిజ‌న యువ‌కుల‌కు డిసెంబర్ 28న ఉదయం 10 గంటలకు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ వైటీసీ కేంద్రంలో ఈ జాబ్‌ మేళాను ఏర్పాటు చేశారు. అర్హులైన ప్ర‌తీ నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని, ఈ మేళాను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. అంతేకాకుండా, మేళా స‌మ‌యంలో అభ్య‌ర్థుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా మేళా నిర్వహిస్తున్నామని కుష్బూ గుప్తా స్ప‌ష్టం చేశారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Dec 2024 08:34AM

Photo Stories