Job Mela : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా.. పోస్టుల వివరాలు..

కడప: జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్లరోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం సంస్థలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో డిప్యూటీ ఆఫీసర్, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు, ఛానల్ ప్లే లిమిటెడ్ సంస్థలో అసెంబుల్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలన్నారు. 18–35 మధ్య వయస్సుగల వారు అర్హులని, ఎంపికైన వారికి హోదాను బట్టి రూ.10–18 వేల వరకు వేతనం ఉటుందన్నారు. ఆసక్తి, అర్హగతగల అభ్యర్థులు విద్యార్హతల ధృవపత్రాలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)