Skip to main content

48,000 Jobs in Postal Department : టెన్త్ అర్హ‌త‌తోనే ఉద్యోగం.. నిరుద్యోగుల‌కు పోస్ట‌ల్ శాఖ గుడ్ న్యూస్‌.. వివ‌రాలివే..

నిరుద్యోగులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Recruitments at postal department with tenth class eligibility  Post office vacancies announcement 2025  Postal Department recruitment notification 2025  48,000 job openings in Indian post offices

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో, పోస్ట‌ల్ శాఖ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని పోస్ట్ ఆఫీసుల్లో క‌లిపితే, 48 వేల గ్రామీణ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మెర‌కు జనవరి 29న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ప్ర‌తీ ఏటా, పోస్ట‌ల్ శాఖ రెండు సార్లు ఖాళీల‌ను భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తుంది.

IOCL New Recruitment 2025 Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 456 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే

ముఖ్య వివ‌రాలు..

ఈసారి కొత్త నోటిఫికేష‌న్‌తో భ‌ర్తీ చేయ‌డంతోపాటు గ‌తంలో విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌తో మిగిలిపోయిన ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థులు.. టెన్త్‌ పాసైతే చాలు, ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. వయసు విష‌యానికొస్తే.. అభ్య‌ర్థులు 18 ఉంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

Job Mela 2025: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే..?

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కులు (గ్రేడ్‌), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు పరీక్ష ఫీజు ఉండదు. మిగతా అభ్యర్థులు దరఖాస్తులు ఫీజుగా రూ.100 చెల్లించాలి. నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Jan 2025 08:41AM

Photo Stories